మామిడి చెట్టుకు సెక్యూరిటీ.. ఫోటో వైరల్..

Satvika
మామిడి పండు..ఈ పేరు వినగానే అందరికి నోట్లో నీళ్ళు ఊరుతాయి.. సమ్మర్ అంటే చాలు ప్రతి ఒక్కరికి మామిడి పండ్లు తినాలని అనుకుంటారు..సమ్మర్ అంటే ఇక ఎవరిని ఆపలెము.. మామిడి కాయలు తినకుండా ఉండరు. ఎక్కడ చూసిన ఈ పండ్లు దర్శనమిస్తుంటాయి. మారుమూల పల్లెల్లో వుండేవాళ్ళు డైరెక్ట్ చెట్ల నుంచి పండ్లను కోసుకొని తింటారు..మామిడి పండ్ల మీద మక్కువతో అవి పూర్తిగా రాకముందె వాటిని తీసుకొని తినెస్తారు. ఇంకో విషయం ఏంటంటే అవి వేరే తోటలో ఉన్నా కూడా దొంగలించి తింటారు. అలా తీసుకొనే కాయలకు రుచి ఎక్కువ అని అంటారు.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు మామిడి చెట్టుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కానీ కొసుకొవడానికి వీలులేదు. ఎందుకంటే ఆ చెట్టుకు ఎప్పుడూ సెక్యురిటి వుంటుంది. టైట్ సెక్యూరిటీగా తేనే తీగలు ఉన్నాయి.దీంతో అటువైపు వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు.. దాంతో చెట్టును చూడటానికి కూడా జనాలు ముందుకు వెళ్ళడం లేదు. మిలటరి సెక్యూరిటీ ఉందని అందరూ ఫన్నీగా అంటున్నారు.


తేనెటీగల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటిని గెలకనంతవరకు అంతాబాగానె వుంటుంది. ఒకాసారి వాటిని కదిలిస్తె ఎలా వుంటుందో అందరికి తెలిసిందే. వాటిని వేధించడం అంటే కష్టాలని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే అవి కరిస్తే చాలా మంటగా ఉంటుంది. ఆ నొప్పిని భరించడం మనుషుల వల్ల కాదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి.. అలాంటి తేనెటీగలు ఇప్పుడు ఆ చెట్టుని కాపాడుతున్నాయి. ఇప్పుడు ఆ చెట్టు మామిడి కాయలు కోయాలంటే మామూలు విషయం కాదు. ఈ ఫొటోని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి క్యాప్షన్ కూడా పెట్టాడు. 'ఈ సీజన్‌లో మొదటి మామిడి. అది కూడా ఫుల్ సెక్యూరిటీ తో' అని రాశాడు. అది పోస్ట్ చేసిన కొద్ది సమయానికె ఈ ఫొటోని 40 వేల మందికి పైగా చూసారు లైక్ చేశారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఎవరికీ నచ్చిన కామెంట్స్ ను వాళ్ళు చేస్తున్నారు. మీరు ఆ ఫోటో పై ఓ లైక్ వేసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: