వైరల్ : బంతి వేయకముందే.. బ్యాట్స్మెన్ పరుగో పరుగు?
ఈ వీడియో చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేరు పోతున్నారు అందరు. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగింది అంటారా.. సాధారణంగా క్రికెట్ ఆట గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బౌలర్ బంతి విసిరిన తర్వాత ఇక ఆ బంతి బ్యాట్స్ మెన్ కు చేరుకున్న తర్వాత నాన్ స్ట్రైక్ లో ఉన్న ఆటగాడు పరుగులు తీయాల్సి ఉంటుంది. ఇక బౌలర్ బంతి వేయకముందే పరుగులు తీస్తే వికెట్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా బౌలర్ బంతి వేసేటప్పుడు నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్ పరుగులు తీయడానికి రెడీ గా ఉంటాడు. కానీ ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ మాత్రం బంతి వేయకముందే ఏకంగా పరుగులు తీశాడు.
దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు అనే చెప్పాలి.. ఎందుకంటే కేవలం రెండు మూడు అడుగులు వేయలేదు. ఏకంగా అవతలి వైపు ఉన్న బాట్స్ మెన్ వరకు పరుగులు తీయడం గమనార్హం. అయితే ఈ సమయంలోనే క్రీడా స్ఫూర్తి చూపిన బౌలర్ మాన్ కడింగ్ చేయకుండానే అంపైర్కు ఫిర్యాదు చేశాడు. మరోసారి ఇలా చేస్తే ఊరుకోను అంటూ హెచ్చరించాడు. ఇక ఇది గమనించిన వ్యాఖ్యాతలు ఇద్దరూ కూడా నవ్వు ఆపుకోలేక పోయారు. యూరోపియన్ క్రికెట్ మ్యాచ్ లో ఈ సరదా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..