పెళ్ళి ఒకప్పుడు అప్పగింతలతో జరిగేది.. తర్వాత రాను రాను అవి కాస్త ఒప్పందాలుగా మారాయి. అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు కట్నకానుకల విషయం గురించి చర్చించుకుంటారు. అంతేకాదు కొన్ని ఒప్పందాలు, అగ్రిమెంట్ లు కూడా వుంటాయి.. ముందుగా అనుకున్న కట్నం ను పెళ్ళి సమయంలో ఇవ్వలెకుంటే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిన పెళ్లిళ్ల ను కూడా మనం చూసే ఉంటాము.. కానీ ఇప్పుడు మరో కొత్త అగ్రిమెంట్ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..అమ్మాయి, అబ్బాయి ల పవర్తన అగ్రిమెంట్.. ఆ అగ్రిమెంట్ ప్రకారం భవిష్యత్తు లో నడుచుకోకుంటే విడిపోవచ్చు అని అర్థం..
ఇది వినడానికి వింతగా వున్నా కూడా ఇలాంటి ఒప్పందం తో ఓ జంట ఒకటైపోయారు. అదేమిటో వివరంగా తెలుసుకుందాం..ఒకరికి తెలీకుండా ఒకరు కొన్ని పనులు చేయొద్దంటూ.. ఇద్దరు కలిసి అగ్రిమెంట్ రాసుకున్నారు. వధూవరుల మధ్య అగ్రిమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న యువతీయువకులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పెద్దలకు తెలియజేయడంతో వారు అందుకు ఒప్పుకున్నారు. వారి పెళ్ళికి అంతా కలిసి ఓ ముహూర్తం పెట్టారు. పెళ్లి వేడుక జరగాల్సిన సమయం కూడా రానే వచ్చింది. బంధువులు, సన్నిహితులంతా మండపానికి చేరుకున్నారు. తాళి కట్టే ఘట్టం కోసం అంతా ఆసక్థిగా చూస్తున్నారు. తాళి కట్టే సమయంలో వధూవరుల షాక్ ఇచ్చారు.
పెళ్లి అయిన తర్వాత రోజుకు కనీసం మూడు సార్లయినా 'ఐ లవ్ యూ' అని చెప్పాలి, ఒకరికి తెలీకుండా ఒకరు బోన్‌లెస్ చికెన్ అసలు తినకూడదు, జీవితాంతం ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమతో ఉండాలి.. ఇలా రూ.100ల బాండ్ పేపర్‌పై నిబంధనలు రాసుకున్నారు. వాటిని పెద్దల ముందు చదివి వినిపించి, సంతకాలు చేసుకున్నారు. ఇలా ఇద్దరు కలిసి ఒకరికి మరొకరు అగ్రిమెంట్ రాయించుకుని తీసుకున్న తర్వాత పెళ్ళి తంతు జరిగింది. ముందు బంధువులు షాక్ అయిన కూడా వారిద్దరి ఆలోచన బాగుందని అభినందించారు. ఇలాంటివి వుంటే పెళ్ళి తర్వాత ఎటువంటి సమస్యలు రావని వాళ్ళు అన్నారు.