వైరల్ వీడియో : తగ్గని వరకట్న వేధింపులు.. ఏకంగా స్టేజ్ పైనే?

praveen
ఒక వైపు మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు నేటి రోజుల్లో ఎన్నో నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు. అయితే ఇక కూతురుకూ పెళ్లి చేసి ఒక మంచి అయ్య చేతిలో పెడితే ఇక కూతురికి తన భర్త అండగా రక్షణగా ఉంటాడని కూతురు సంతోషంగా ఉంటుందని ఎంతో మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ అంగరంగ వైభవంగా పెళ్ళి చేసి కట్నకానుకలు  ఇచ్చిన తర్వాత కూడా మెట్టినింట్లో వరకట్న వేధింపులతో ఆడపిల్ల అడుగడుగునా వేధింపులకు గురవుతూనే ఉంది. చట్ట ప్రకారం వరకట్నం తీసుకోవడం తప్పు అని అందరికీ తెలుసు కానీ వర కట్నం లేకుండా పెళ్లి చేసుకునే వారు మాత్రం నేటి రోజుల్లో ఎవ్వరు కనిపించడం లేదు.


 ఒకవేళ ఇక కాస్తోకూస్తో కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత వారి నిజస్వరూపాన్ని బయటపెట్టి అదనపు కట్నం కోసం పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా వేధించడం మొదలు పెడుతున్నారు. ఇలాంటి రోజుల్లో ఇక ఆడ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతీ విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అయితే సాధారణంగా పెళ్లయిన తర్వాత కొన్ని రోజులకు వరకట్న వేధింపులు జరగడం చూశాము కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పెళ్లి వేదిక పైన వరకట్న వేధింపులు జరిగాయి అన్నది తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ వీడియో లో భాగంగా వరుడు వధువు వేదికపై కూర్చుంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఒకవేళ కట్నం డబ్బులు తర్వాత ఇస్తే ఏం చేస్తారు అని అడగగా పూర్తి కట్నం ఇవ్వకపోతే ఇక్కడనుంచి వెళ్ళిపోతాము అంటూ అందరి ముందే పెళ్లి మండపంలో చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన బీహార్లో జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇలా మాట్లాడి న వరుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి కావడం గమనార్హం.  ఇక వధువు ఎంతలా బ్రతిమిలాడిన వరుడు మాత్రం అస్సలు వినిపించుకోకుండా.. నలుగురి ముందు పరువు పోతుందని మాత్రం ఆలోచించకుండా.. పెళ్లి క్యాన్సల్ చేసుకుంటాను అని చెప్పడంతో ఇక ఈ వీడియో చూసిన తర్వాత అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: