పెళ్లి వేడుకలో బోరున ఏడ్చిన వధూవరులు.. ఎందుకో తెలుసా?
అందుకే పెళ్లి అంటే ఎంతో సంతోషంగా జరుగుతూ ఉంటుంది. అందరి ముఖాల్లో నవ్వు వెల్లివిరుస్తూ ఉంటుంది. అయితే పెళ్లి జరుగుతున్న సమయంలో ఎంతో సంతోషంగా ఉన్న వధువు పుట్టింటి ని వదిలి మెట్టినింటికి వెళ్తున్న సమయంలో మాత్రం ఏడుస్తూ ఉంటుంది.. తన తల్లిదండ్రులను వదిలి వెళ్తున్న సమయంలో కన్నీటి పర్యంతం అవుతూ ఉంటుంది. కానీ ఏకంగా పెళ్లి వేడుకలో వరుడు ఏడవడం ఎప్పుడైనా చూసారా ఇక్కడ జరిగిన పెళ్లి వేడుకలో మాత్రం వధువు తోపాటు వరుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకం. వారు కోరుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది అంటే ఇక సంతోషం మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది.
సంతోషం కొన్ని కొన్ని సార్లు ఆనందభాష్పాలుగా కూడా వస్తూ ఉంటాయి. దీనికి సాక్ష్యం ఇక వైరల్ గా మారిపోయిన వీడియో నే. వరుడు తన సన్నిహితులతో కలిసి పెళ్లి మండపం లో అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే వధువు డాన్స్ చేస్తూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక వధువును చూడగానే వరుడు ఆనందంలో ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు.ఆ తర్వాత వరుడు దగ్గరికి వచ్చిన తర్వాత వధువు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సన్నివేశంతో చూసి అక్కడున్న వారందరూ కూడా ఎమోషన్ అయ్యారు. ఇక ఈ వీడియో ఆటో నెటిజన్ల అందర్నీ కూడా ఫిదా చేస్తోంది..