వైరల్ వీడియో : బుడ్డోడు రాక్.. మమ్మీ షాక్.. కిస్ పెట్టేశాడు?

praveen
సాధారణంగా చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని కొన్ని సార్లు విసుగు తెప్పిస్తుంటాయ్. కానీ కొన్నిసార్లు మాత్రం సరదాగా అనిపిస్తూ ఉంటాయి.. తెలిసి తెలియని వయసులో చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని సార్లు నవ్వు కూడా తెప్పిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా స్కూల్ కు వెళ్లే సమయంలో చిన్న పిల్లలు ఏడవటం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది నవ్వుతు స్కూల్ కి వెళుతుంటారు. అయితే ఇలా తమ పిల్లలను స్కూలుకు పంపించడానికి వెళ్ళినా తల్లిదండ్రులు ఒకసారి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి  పంపించడం సర్వ సాధారణంగా జరిగేదే.


 లేదంటే ఇక స్కూల్ లోపలికి వెళ్లే ముందు ఒక కిస్ పెట్టు నాన్నా అంటూ అడిగి మరీ ముద్దు పట్టించుకుంటారు తల్లిదండ్రులు. ఇక్కడ ఒక తల్లి స్కూల్లో తన కొడుకుని విడిచిపెడుతూ నాన్న ఒకటి ముద్దు పెట్టు నాన్న అంటూ అడుగుతుంది. ఇక తల్లి చెప్పింది తూచా తప్పకుండా పాటించే ఆ బుడ్డోడు..  తల్లి చెప్పినట్లుగానే ఆ బుడ్డోడు కిస్ పెడతాడు. కానీ తల్లి షాక్ అవుతుంది. ఇక ఇలా ముద్దు పెట్టిన తర్వాత షాక్ ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారు కదా.. తల్లి అడగ్గానే ఆ బుడ్డోడు ముద్దు పెట్టింది తల్లికి కాదు పక్కనే స్కూల్ లోకి వెళుతున్న బాలిక కి.


 ఇక కొడుకు చేసిన పనికి షాక్ అయిన తల్లి ఒక్కసారిగా నవ్వుకుంది  ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ముఖంలో నవ్వు చిగురిస్తుంది అని చెప్పాలి.. ఈ వీడియో చూసి  చిన్న పిల్లాడే కానీ మహా చిలిపి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియో మాత్రం ప్రతి పేరెంట్స్ కి బాగా కనెక్ట్ అయి పోతుంది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: