ఓరి నాయనో.. వీడి ధైర్యానికి సలాం కొట్టాల్సిందే?

praveen
పాము చిన్నదైనా పెద్దదైనా విషపూరితమైన విషం లేనిది అయినా సరే ఒక్కసారి కళ్ళముందు కనిపించింది అంటే చాలు అందరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇక పాము కనిపిస్తే అటువైపు వెళ్ళకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కొంతమంది సాహసం చేసి కాస్త దూరం నుంచి వెళ్లడం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పాము కనిపించగానే పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటారు. ఇలా దాదాపు అందరూ కూడా పామును చూస్తే కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చిన్న పాములు కాదు ఏకంగా ఒకేసారి పది మందిని మింగేసే అంత పెద్దగా ఉన్నా కొండచిలువలా మధ్య కూర్చుని వారితో సరదాగా గడుపుతూ ఉంటాడు.



 ఇక ఇది చూసిన తర్వాత ఆ బాలుడి ధైర్యానికి అందరూ కూడా ఫిదా అవ్వకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే కొండ సిలువ ల మధ్య ఉన్నప్పటికీ ఆ బాలుడికి ఆ మాత్రం ఆ పాములు ఎలాంటి హాని చేయకుండా  ఉండడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత కొండచిలువలతో ఇలాంటి సావాసం ఎప్పటికైనా ప్రమాదకరం అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.


 ఇక ఒక్కసారి ఈ వీడియో లోకి వెళ్లి చూస్తే.. పెద్ద కొండచిలువ కనిపిస్తుంది.. ఇక  దాన్ని చూస్తే అందరి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. కాస్త దగ్గరికి వెళ్లిన తర్వాత ఒకటి కాదు రెండు పెద్ద కొండ చిలువలు ఉన్నాయి అన్న క్లారిటీ వస్తుంది. రెండు పెద్ద కొండచిలువ లు ఒకే దగ్గర పక్కనే ఉన్న కూడా బాలుడు ఆ కొండచిలువను ఒడిలో పెట్టుకొని ఆడుకుంటున్నాడు. అంతేకాదు కొండచిలువలు కూడా బాలుడిని ఏమీ అనకుండా గమ్మున ఉండిపోయాయి. ఇక ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఒకటికి రెండు సార్లు చూసిన కూడా ఇది నిజమేనా అని నమ్మలేకపోతున్నారు అందరు..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: