వామ్మో ఇదేం మ్యాజిక్.. చూస్తే అవాక్కే?
కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చూసిన తర్వాత మాత్రం ఇది ఎలా చేయగలిగాడు అబ్బా అని అందరూ ఆలోచనలో పడి పోతూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి ఒక అరుదైన మ్యాజిక్ గురించి అని చెప్పాలి ఇప్పుడు మనం చూసే మ్యాజిక్ ట్రిక్ ఎలా చేశాడు అన్నది ఎంత చూసినా కూడా అంతుపట్టదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రేంజ్ లో మ్యాజిక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.
షుగర్ ప్యాకెట్ తో ఒక వ్యక్తి చేసిన మ్యాజిక్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో చూస్తే.. ఒక వ్యక్తి షుగర్ ప్యాకెట్ తీసుకొని దానిని కుడిచేతిలో పోస్తాడు. ఆ తర్వాత షుగర్ ను పైకి విసిరేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో అని అక్కడున్న వారందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా లెఫ్ట్ హ్యాండ్ తో క్యాచ్ చేసి అందరికీ చూపిస్తాడు.. షుగర్ క్యాచ్ పట్టడంతో ఏంటి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇక లెఫ్ట్ హ్యాండ్ నుంచి షుగర్ పోసి చూపించడంతో అక్కడున్న వారందరూ షాకవుతారు.