సినిమాలు చూడటానికి బాగుంటాయి.. అందులో కొన్ని సన్నీవేశాలు జనాలను ఆష్చర్యాని కి గురి చేస్తాయి. డబ్బుల కోసం ఇలా కూడా వ్యాపారం చేస్తారా అనే విధంగా కొన్ని సినిమాలలొ చూపించారు. అలాంటి షాకింగ్ సీన్లు ఉన్న సినిమా ఠాగూర్ సినిమా గురించి మనందరికీ తెలుసు.. ఈ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో వచ్చిన హాస్పిటల్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. డబ్బులు కోసం శవానికి వైద్యం చేసిన డాక్టర్ల బండారం బయట పెట్టారు చిరంజీవి.
అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది ఆసినిమా చూసిన తర్వాత తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు నిజ జీవితంలో అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది. వివరాల్లొకి వెళితే.. సినిమా లెవల్ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా ఉమెన్‌తాల గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి ఈ నెల 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసుకున్నాడు.. అది గమనించిన అతని తండ్రి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం కోసం అతణ్ణి ట్రైడెంట్ అనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం వరకు పేషెంట్ చికిత్స విషయాలు చెప్పిన వైద్యులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
అంతేకాదు అతనికి ఇంకా మెరుగైన వైద్యం చేస్తున్నాము అంటూ ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. అయితే అతని బంధువులు వాళ్ళు అడిగినట్లు రెండు లక్షలను కట్టారు.మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మిగతా డబ్బులు కట్టి డెడ్‌బాడీ తీసుకుపోవాలని డాక్టర్లు తెలినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.. అయితే అతను చనిపోయి రెండు రోజులు అయినా వైద్యులు చెప్పకుండా దాచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..