వరుడి మెడలో దండ వేయబోతే.. బొక్క బోర్లా పడింది?
కానీ కొన్ని కొన్ని సార్లు నవ్వులపాలు అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి సరదా సన్నివేశాలు సోషల్ మీడియాలో కి వచ్చాయి అంటే చాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇటీవలే పెళ్లి లో ఇలాంటి ఒక ఫన్నీ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి ఇక అటు నెటిజన్లు అందరూ తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. వివాహ వేడుక జరుగుతుంది. ఇక చుట్టూ ఉన్న బంధువులు అందరూ కూడా ఇక వివాహాన్ని వీక్షిస్తున్నారు. అదేసమయంలో వరుడు వధువు కి సింధూరం దిద్దడానికి రెడీ అవుతున్నాడు.
ఇంతలో వధువు వెనకాల నిలబడిన ఒక యువతి చేతిలో దండలు పట్టుకొని ప్రత్యక్షమైంది. అంతేకాదు ఏకంగా అక్కడినుంచి గాల్లోకి జంప్ చేసి ఇక వరుడి మెడలో దండ వేయాలని అనుకుంది. కానీ అంతలో గమనించిన వరుడు ఒక్కసారిగా పైకి లేచాడు. దీంతో బొక్కబోర్లా పడిపోయింది సదరు యువతి. దీంతో షేమ్ గా ఫీలై వెంటనే అక్కడి నుంచి లేచి వెనక్కి వెళ్ళిపోయింది ఆ యువతి. మినీ డబ్ల్యూ డబ్ల్యూఈ అంటూ ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా.. ఎంతోమంది ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఇక మరి కొంతమంది అయ్యో పాపం ఆ అమ్మాయి ఏదో ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.