
వధువును చూసి కంట్రోల్ తప్పిన వరుడు.. చివరికి?
ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక ఇలా పెళ్లి పందిరి లో వదువులు డాన్స్ చేసిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోను చూసేందుకు నెటిజన్లు కూడా తెగ ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారిపోతుంది. అంతే కాదు అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తుంది. ఒకసారి ఈ వీడియోలో గమనిస్తే వధువు దగ్గరికి వెళ్లిన వరుడు ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక పోయాడు. ఎంతో ప్రేమతో వధువును అందరి ముందు ఎత్తుకోవాలి అనుకున్నాడు.
ముందు వధువు రాక ఎప్పుడు ఉంటుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసాడు వరుడు. ఈ క్రమంలోనే అక్కడికి డాన్స్ చేస్తూ వచ్చింది వధువు. దీంతో దగ్గరికి ఎంతో ప్రేమగా వెళ్ళాడు వరుడు. ఆ తర్వాత చేతులు పట్టుకుని కాసేపు డాన్స్ చేశాడు. కానీ వధువు అందాన్ని చూసి ఫిదా అయిపోయిన వరుడు తనని తాను ఆపుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే డాన్స్ చేస్తూ అందరి ముందు పెళ్లి కూతురు ని ఎంతో ప్రేమగా కౌగిలించుకోవాలి అని అనుకున్నాడు. ఇక అంతలో అతను వధువును ఎత్తుకోబోయాడు. కానీ వధువు మాత్రం ఇప్పుడు వద్దు అంటూ సైగ చేసింది. ఇక ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో కి రావడంతో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.