వైరల్ : చీర కట్టుకున్న రోబో.. ఏం చేసిందంటే?
సాధారణంగా ఒకప్పుడు హోటల్లో పని చేయడానికి వేయిటర్లు ఉండే వారు. కొన్ని హోటళ్లలో మహిళా వేయిటర్లు ఉంటే కొన్ని హోటళ్లలో మాత్రం పురుషులు వేయిటర్లు గా పనిచేసేవారు. ఇక హోటల్ కి వచ్చిన కస్టమర్కు ఏం కావాలి అన్న ఎంతో వినయంగా అడిగేవారు.. వారికి కావాల్సిన ఆర్డర్ తెచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నో హోటళ్లలో మనుషులకు బదులు రోబోలు ఎడిటర్ గా మారి పోతున్న ఘటనలు చూస్తూ ఉన్నాం. కస్టమర్ల నుంచి ఆర్డర్ స్వీకరించడం.. ఇక ఆ తర్వాత ఎంతో వినయం గా కస్టమర్లకు అడిగింది అందివ్వడం లాంటివి చేస్తున్నాయ్.
అయితే ఇప్పటి వరకు రోబోలు ఎలా ఉంటాయి అందరూ చూసే ఉంటారు. కానీ ఇక్కడ రోబో మాత్రం కాస్త స్పెషల్.. ఎందుకంటే భారతీయ సాంప్రదాయం లో చీర కట్టుకుని అందరికీ మర్యాదలు చేస్తుంది ఇక్కడ ఒక రోబో. మైసూరు లోని సిద్ధార్థ హోటల్ యాజమాన్యం హ్యూమనాయిడ్ రోబో ఏర్పాటు చేసుకుంది.. చీరకట్టు ఒంటినిండా నగల తో అక్కడికి వచ్చిన కస్టమర్కు రోబో సేవలు అందిస్తుంది. కస్టమర్లు చెప్పిన ఆర్డర్ను ఎంతో సులభం గా తెచ్చి ఇస్తుంది . అయితే దాదాపు పది కేజీల వరకు ఈ రోబో బరువును మోయగలదు.