విమానంలో వీరంగం సృష్టించిన ప్రయాణీకుడు.. వీడియో..

Satvika
విమానం లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఒక్కోసారి ఒక్కో విధంగా వింతగా చేస్తారు. అది ఎందుకు చెస్తున్నారొ కూడా వాళ్ళకు తెలియకుండా చేస్తారు. అయితే వాళ్లు చెసెవి ఒక్కోసారి ప్రమాదాలకు గురిచెస్తుంది.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి విమానం యొక్క ప్రధాన ద్వారాన్ని తెరిచెందుకు ప్రయత్నం చేసాడు. అతను ఎందుకు అలా చేసాడు అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు.. కానీ ఒక్కసారిగా ప్రాణాలు పోయిన పని అయ్యింది..


ఇది నిజంగానే ఆశ్చర్యానికి గురి చెస్తుంది కదా.. అవును మీరు విన్నది నిజమే.. ఓ వ్యక్తి అందరి ప్రయానికుల ప్రాణాలను గాల్లో కలిపే ప్రయత్నం చేసాడు.. అక్కడ వున్న ఫైలెట్ సిబ్బంది గమనించి ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. దాంతో ప్రమాదం నుంచి బయట పడ్డారు.. ఈ ప్రమాదం అమెరికా జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. వివరాల్లొకి వెళితే.. ఈ ఆశ్చర్యకరపు ఘటన అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి వాషింగ్టన్‌కు విమానం బయల్దేరింది.. కొద్ది సేపు అయ్యాక అందులో ప్రయానిస్తున్న ఓ ప్రయాణీకుడు రివాస్ అందరు చూస్తుండగానే ఆ విమానంలోని ప్రధాన డోరును తెరిచేందుకు ప్రయత్నించాడు.


అది గమనించిన ఫ్లైట్ అటెండెంట్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయాడు..టీ పాట్‌తో అతడి తల పగులగొట్టాడు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి విమానంలో ప్రయాణం చేస్తున్న మరో ప్రయాణీకుడు తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసాడు.తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై అమెరికా న్యాయ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత.ఫ్లైట్ అటెండెంట్ల దగ్గర నుంచి వైన్ బాటిల్ తీసుకున్న రివాస్ సిబ్బంది తల పగల కొట్టే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: