వైరల్ : ప్రియురాలిని బ్యాగ్లో కుక్కాడు.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
చదువుకుంటే ఉన్న మతి పోయింది అని ఒక నానుడి ఉంటుంది. కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇదే నిజమని అనిపిస్తూ ఉంటుంది. ఇటీవలికాలంలో స్కూలు కాలేజీలకు పోతున్న ఎంతోమంది విద్యార్థులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేయసితో తన గదిలో రాత్రంతా గడపాలని ఒక కుర్రాడు నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఎవరు ఊహకందని విధంగా ప్లాన్ వేసాడు. గర్ల్ ఫ్రెండ్  ను రూమ్ కు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కానీ చివరికి ప్లాన్ కాస్తా బెడిసికొట్టింది. కర్ణాటక మణిపాల్ హాస్పిటల్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

 ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థి అదే కాలేజీలో చదువుతున్న యువతి తో ప్రేమలో పడ్డాడు. ఇటీవలే ప్రియురాలితో గదిలో ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు. తన గదికి తీసుకెళ్లడానికి పక్కా ప్లాన్ వేసాడు. ఒక పెద్ద ట్రాలి బ్యాగ్లో ప్రియురాలిని కుక్కడు. ఇక హాస్టల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంతో అమాయకుడిగా నడుచుకుంటూ వెళుతున్న ఆ విద్యార్థిని చూసి వార్డెన్ కు అనుమానం వచ్చింది. అంత పెద్ద లగేజ్ ఏంటి అంటూ ప్రశ్నించాడు వార్డెన్. ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులు వచ్చాయంటూ కాస్త భయం భయం గానే సమాధానం చెప్పాడు ఆ విద్యార్థి. దీంతో మరింత అనుమాన పడిన వార్డెన్ ఓపెన్ చేయాలంటూ కోరాడు.

 అయితే అందులో పగిలిపోయే వస్తువులు ఉన్నాయంటూ చెప్పినప్పటికీ హాస్టల్ వార్డెన్ వినకుండా ఆ బ్యాగ్ ఓపెన్ చేసాడు. అంతే అందులోనుంచి ఒక అమ్మాయి బయటికి రావడం అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు విషయం ఏంటి అంటే నిలదీయగా రాత్రంతా ప్రియురాలితో ఎంజాయ్ చేయడానికి ఇలాంటిప్లాన్ చేశా అంటూ ఒప్పుకున్నాడు. దీంతో ఇక ఇద్దరు స్టూడెంట్స్ ని కూడా సస్పెండ్ చేసి ఇళ్లకు పంపించింది కాలేజీ యాజమాన్యం  దీనికి సంబంధించిన వీడియో మతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: