
అదిరే ఆఫర్.. దోశ తింటే రూ. 71 వేల ప్రైజ్ మనీ?
ఇందులో రకరకాల ఆహార పదార్థాల పెట్టి ఇవన్నీ కేవలం 40 నిమిషాల్లో ఆరగించిన వారికి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానంటూ ఆఫర్ పెట్టడంతో ఎంతోమంది ట్రై చేసారూ. కానీ విఫలమయ్యారు. చివరికి ఒకే ఒక యువకుడు ఇక ఈ బిర్యానీ మొత్తం ఆరగించి లక్ష రూపాయల చెక్కు అందుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి చాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ ఈటింగ్ చాలెంజ్ విసిరింది. ఈ చాలెంజ్ లో ఒక దోష తింటే సరిపోతుంది.. ఓస్ అంతేనా టక టక తినేస్తాం.. ఇంతకీ ప్రైజ్ మనీ ఎంత అంటారా..
దోస గురించి అసలు విషయం తెలిస్తే మాత్రం ఇలా ఆత్రుత పడరు.. ఎందుకంటే అందరం తినే చిన్నపాటి దోషి కాదు ఏకంగా పది అడుగుల దోస ను ఛాలెంజ్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు.. దీని ధర దాదాపు 1500. దీనిని ఒకే ఒక వ్యక్తి ఏకంగా 40 నిమిషాల్లో తినాల్సి ఉంటుంది. ఇక 40 నిమిషాల్లో పది అడుగుల దోస తినటం పూర్తిచేశాడు అంటే 71 వేల ప్రైస్ మనీ ఇస్తారు. ఇక ఈ ఆఫర్ తో తమకు కస్టమర్లు ఎంతగానో పెరిగారని రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ శక్తి సాగర్ రెస్టారెంట్ లో ఇక ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మీకు ట్రై చేయాలనిపిస్తుంది కదా.. అలా అనిపిస్తే ఆ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే మరి.