Viral video : వామ్మో! చేతిలో పాముకే నీళ్లు తాపించాడు..

Purushottham Vinay
ఇక ఈ సరికొత్త సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి.ఇక తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో అయితే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి పాములు చాలా ప్రమాదకరమైన ప్రాణులని చెప్పాలి. ఇక వాటి పేరు వింటేనే.. చాలామంది భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తుంటారు. ఇక దగ్గరగా ఓ పెద్ద పామును కనుక చూస్తే.. ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకటే ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనవుతుంది. ఇక తాజాగా ఓ పాముకు చెందిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు. ఇక ఆ వీడియోలో ఒక పాము కనిపిస్తుంది. దానికి ఒక వ్యక్తి తన చేతితో నీళ్లు తాపిస్తున్నాడు. మీరు ఈ వీడియో కనుక చూస్తే.. వామ్మో ఇదేంటి అంటూ బాగా భయపడుతారు. అంతేకాకుండా మీ గుండె వేగం కూడా బాగా పెరుగుతుంది.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఒక వ్యక్తి తన అరచేతిలో నీళ్లు పోసి ఈ పాముకి ఎలా నీళ్లు తాపిస్తున్నాడో ఇందులో మనం చూడవచ్చు. ఆ వీడియోలో కనిపిస్తున్నది చూస్తే ఎవరైనా సరే తన చేతిలోని నీటిని పాముకి తాపిస్తాడని అసలు ఎవరూ కూడా ఊహించి ఉండరు. వీడియో గనుక చూస్తుంటే ఈ పాము ఆ వ్యక్తి పెంపుడు పాములా కనిపిస్తోంది.ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఇప్పటి దాకా ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాలుగా ఈ వీడియోపై కామెంట్లు కూడా చేస్తున్నారు.ఈ పాములు ఎప్పటికీ కూడా మనుషులకు స్నేహితులు కావంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. అది ఎప్పుడూ కూడా విషంతో ఉంటుందని..ఇక దానితో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.కాగా..ఈ వీడియోని 2020 సంవత్సరంలో జూన్‌లో షేర్ చేయగా.. తాజాగా అది మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.


https://twitter.com/susantananda3/status/1273624772815933441?t=F97QY2UtnkB_v7h1QLA3lQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: