వావ్.. తాత నువ్వు కేక.. వైరల్ వీడియో..

Satvika
మ్యూజిక్ వస్తే చాలా మందికి పూనకమ్ వచ్చినట్లు చాలా మంది డ్యాన్స్ వేస్తారు. చిన్న నుంచి పెద్ద వరకూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య డ్యాన్స్ కు సంబంధించిన వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతూన్నాయి. అవి బాగా ట్రెండ్ అవుతూన్నాయి కూడా.. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తీన్ మార్ లాంటి మ్యూజిక్ వినిపించిన ఆగరన్న విషయం తెలిసిందే. మనకు తెలియకుండానే కాళ్లు చేతులు డ్యాన్స్‌ చేస్తుంటాయి. మనసులో ఏదో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది.

అరే మనం కూడా సరదాగా స్టెప్పులేద్దామని మనసులో ఉన్నా ఎదుటివారు ఎమనుకుంటారోనన్న మొహమాటం, సిగ్గు, వయసు తదితర కారాణాల తో మన కోరికలు, ఆకాంక్షల ను అణిచివేసుకుంటాం.. కానీ ఇప్పుడు చాలా మంది అస్సలు భయ పడలేదు. అలా భయపడే వారికి ఆదర్శం గా ఓ వృద్దుడు మెస్మరైజ్ చేసే డ్యాన్స్ చేసాడు. వృద్ధుడు తన వయసును మర్చిపోయి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. వేలాది మంది ఎదుట ఉన్నా హుషారైన స్టెప్పుల తో ఇరగదీశాడు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

సప్నా చౌదరి సోషల్‌ మీడియా ను బాగా ఫాలో అయ్యేవారికి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హరియాణా రాణిగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆమెకు మాస్ ఫాలోయింగ్‌ కూడా భారీగానే ఉంది. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. కాగా ఓ బహిరంగకార్యక్రమంలో పాల్గొన్న సప్నా వేదికపై హర్యాన్వి పాటకు డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది.. అక్కడ జనం లో వున్న ఒక ముసలాయన డ్యాన్స్ వేసి అందరినీ ఆకర్షింఛాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. మరి నెటిజన్ల ఎంతగా ఆకట్టుకుంటోందో మీరే చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: