వైరల్ : ఛీ యాక్.. ఉమ్మితో హెయిర్ కటింగ్?

praveen
మనిషి ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికీ తల పైన ఉండే జుట్టు ఎంతో స్టైల్ గా దువ్వుకుంటే ఆ అందం మరింత రెట్టింపు అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వాడుతూ ఉంటారు.  ఇక అటు సినీ సెలబ్రిటీలు ఎంతోమంది హెయిర్ స్టైలిస్ట్  ల తో సరికొత్తగా సెట్ చేయించుకుంటూ వుంటారు. ప్రస్తుతం ఇండియాలో ఎంతోమంది హెయిర్ స్టైలిస్ట్ లు ఎంతగానో గుర్తింపును సంపాదించుకున్నారు. వారిలో జావేద్ హబీబ్ కూడా ఒకరు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది ప్రముఖులకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేశారు. అయితే ఇలా తన టాలెంట్ తో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న జావేద్ హబీబ్ ఇటీవలే వివాదంలో చిక్కుకున్నారు.

 ఒక సెమినార్ నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ముందు ఉన్న ఆడియన్స్ లో ఒక మహిళను స్టేజి మీదికి పిలిచి ఆ మహిళ హెయిర్ కట్ చేస్తున్న సమయంలో విచిత్రంగా ప్రవర్తించారు. నీరు అందుబాటులో లేకపోతే ఉమ్మి తో కూడా హెయిర్ కట్ చేయవచ్చు అంటూ మహిళలపై ఉమ్మి దారుణంగా ప్రవర్తించారు. ఇక దీనిపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ట్రైనింగ్ సెమినార్ నిర్వహించారు. ఇందులో జావిద్ పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ఓ మహిళను హెయిర్ కట్ కోసం సెలూన్ కుర్చీ వద్దకు పిలిచాడు జావేద్. ఇక సెమినార్ లో భాగంగా దువ్వెనతో జుట్టును సరి చేస్తూ ఒకవేళ మీరు నీటి కొరత ఉంటే ఉమ్మితో  తోనే గడిపేయాలి అంటూ మహిళ తలపై ఉమ్మాడు.

 దీంతో అక్కడ ఉన్న జనం అంతా చప్పట్లు కొట్టారు. ఉమ్మిలో ఒక పవర్ ఉంటుంది అంటూ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక తనకు అందరి ముందు ఎదురైన అవమానకరమైన అనుభవాన్ని షేర్ చేసుకుంది సదరు మహిళ. నా పేరు పూజ.. నేను బ్యూటీ సెలూన్ నిర్వహిస్తాను..  ఇటీవలే జావేద్ హబీబ్ సార్ ఏర్పాటుచేసిన సెమినార్ కు వెళ్లగా.. అతను హెయిర్ కట్ కోసం స్టేజి మీదికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారు. తలపై ఉమ్మడంతో ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇకనుంచి నేను పక్కన ఉన్న షాప్ లో హెయిర్ కటింగ్ చేయించుకుంటటా తప్ప జావేద్ హబీబ్ దగ్గరికి అసలు వెళ్ళను అని ఒక వీడియో విడుదల చేయగా ఇది కాస్త వైరల్ గా మారి పోయి చివరికి వివాదం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: