దేవుడా.. ఈ దారుణమేంటి?

Satvika
ఒక వైపు కరోనా ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుపోతుంది.. మనుషుల మధ్య మళ్ళీ సామాజిక దురాన్ని ఉంచింది.. ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ మహమ్మారి పంజా నుంచి తప్పించు కోవడం అంత సులువు కాదు.. ఇది ఇలా ఉండగా ఓ సెలూన్ లో నీల్లకు బదులుగా ఉమ్మి వేసి హెయిర్ స్టయిల్ ను చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు చేటు.. వినడానికి ఏదోలా వుంది కదూ.. అయితే ఇది జరిగింది.. ఎక్కడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

శిరోజాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే తమ కురులు పొడవుగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎన్నో చిట్కాలు, హెయిర్‌ స్టైలింగ్ పద్ధతులను పాటిస్తారు.ఈ మేరకు తన జుట్టు ను మరింత అందంగా మార్చుకోవడానికి వెళ్ళిన యువథికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి హైయిర్ స్టైలిష్ట్ నీటికి బదులు ఉమ్మి వాడడం ఆయువతితో పాటు చాలామందికి కోపం తెప్పించింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

యూపీకి చెందిన జావేద్‌ హబీబ్‌కు ఆ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హెయిర్‌స్టైలిష్ట్‌గా మంచి గుర్తింపు ఉంది. కాగా ఇటీవల అతని బ్యూటీ పార్లర్‌కు పూజా గుప్తా అనే యువతి వచ్చింది. కాగా ఆ యువతి సెలూన్ ఛైర్ లో కూర్చోని ఉండగా జావేద్‌ దువ్వెనతో ఆమె జుట్టును సరిచేశాడు. హెయిర్ ను ఎలా కాపాడు కొవాలి అనే టిప్స్ ను చెప్పాడు. తర్వాత నీల్లకు బదులుగా ఉమ్మి వేయడం తో షాక్ కు గురైంది.రోడ్ పక్కన సెలూన్ లో అయినా చేయించుకుంటాను గానీ, జావేద్ హబీబ్ దగ్గరకు వెళ్లను' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. జావేద్‌ సిగ్గుమాలిన పని చేశాడని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇది వివాదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: