వామ్మో.. ఇదేందిరా బాబోయ్‌... జ‌డ‌తో బ‌స్సు లాగి ఏకంగా గిన్నీస్ రికార్డే..!

N ANJANEYULU
గిన్నీస్ రికార్డు సృష్టించాలంటే మామూలు విష‌యం కాదు. ఇది ఆశామాష‌ వ్య‌వ‌హారం కాదు. ప్ర‌తీ సంవ‌త్స‌రం ప్ర‌చురించ‌బ‌డే ఓ ప్రామాణిక పుస్త‌కం. అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్ర‌పంచ రికార్డుల‌ను ఇందులో న‌మోదు చేస్తారు. మాన‌వులు సాధించిన ఘ‌న‌విజ‌యాలు, ప్ర‌కృతిలో జ‌రిగి విప‌రీతాల‌ను ఇందులో గుర్తిస్తారు. తొలుత న‌వంబ‌ర్ 10, 1951న స‌ర్ హ‌గ్ బీవ‌ర్‌, ఐర్లాండ్‌లోని గిన్నీస్ బ్రెవ‌రీ కంపెనీ డైరెక్ట‌ర్లు ఓ రోజు స్నేహితుల‌తో ప్ర‌పంచంలో అత్యంత వేగంగా ప‌రుగెత్తే ప‌క్షి ఏది అని వాదిస్తున్నాడు. తొంద‌ర‌లోనే ఈ విష‌యాన్ని నిర్ధారించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అత‌ని అర్థ‌మై.. బ్రిట‌న్‌లో ప్ర‌చురించ‌బ‌డే 81,400 ప్ర‌చుర‌ణ‌ల‌లో ఇలాంటి వివాదాల‌ను ప‌రిష్క‌రించే పుస్తం అప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల కాలేదు. అత‌ని ఆలోచ‌న‌ల‌లో ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను చూపించే పుస్త‌కం చాలా ప్రాచుర్యం పొందింద‌ని భావించారు.
తొలుత ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు పంపిణీ చేసారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన త‌రువాత 1955లో ఆగ‌స్టు 27న 198 పేజీల ప్ర‌తీని విడుద‌ల చేశారు. ఇక అప్ప‌టి నుంచి గిన్నీస్ బుక్ రికార్డు ఫేమ‌స్ అయింది. అందులో న‌మోదు కావాలంటే చ‌రిత్ర సృష్టిస్తే కానీ సాధ్యంకాదు. కానీ జ‌డ‌తో బ‌స్సును లాగ‌డం ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ సాధ్యం కాదు. అది ఒక పెద్ద సాహ‌స‌మే అని చెప్పాలి. సాహ‌సం క‌న్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవ‌చ్చు. కానీ పంజాబ్‌కు చెందిన ఆశారాణి అనే మ‌హిళ త‌న జ‌డ‌తో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సును సున‌యాసంగా లాగింది. ఈ బ‌స్సు బ‌రువు అక్ష‌రాల 12,126 కేజీలు. అన్నీ వాహ‌నాల‌లో అత్యంత బ‌రువు ఉన్న వాహ‌నం దీనిని త‌న జ‌డ‌తో లాగి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసింది ఆశారాణి.
.
2016లోనే ఆశారాణి ఇటీలీలో ఈ ఫీట్‌ను సాధించ‌గా.. త‌న‌కు ఐర‌న్ క్వీన్ అనే బిరుదు కూడా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ప్ర‌తినిధులు ఇచ్చారు. గిన్నిస్ బుక్ త‌న పేరును న‌మోదు చేసారు. తాజాగా అప్ప‌టి వీడియోను గిన్నీస్ బుక్ ఆఫ్ ప్ర‌తినిధులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆమె ఇదివ‌ర‌కే ఏడు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించింది. గ‌తంలో ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆమె ఇదివ‌ర‌కే ఏడు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించింది. గ‌తంలో ఆమె ప‌ళ్ల‌తో 22.16 సెకండ్ల వ్య‌వ‌ధిలో ఓ కారును 25 మీట‌ర్ల దూరం లాగింది. 2013లో త‌న చెవుల‌తో 1700 కిలోల బ‌రువు ఉన్న వాహ‌నాన్ని లాగి రికార్డు సృష్టించిన‌ది. ఇప్పుడు మ‌రొక రికార్డు సృష్టించి ఔరా అనిపించుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: