కరోనా రూల్స్ బ్రేక్ చేసిన గోవా పర్యాటకులు.. వీడియో..

Satvika
" data-original-embed="" >

ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా మాట మళ్ళీ వినిపిస్తోంది. నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ అందుబాటులొకి వచ్చినా కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనాలు బెంబెలెత్తి పోతున్నారు. కొన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ ,నైట్ కర్ఫ్యూలు విధించారు. ఒకవైపు కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. మరో వైపు కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కూడా జనాలను భయపెడుతోంది. అయినా కొన్ని పర్యాటక ప్రాంతాల్లొ జనాలు రూల్స్ కు వ్యతిరేకంగా ఉంటున్నారు.
అందులో ముఖ్యంగా వినిపించే పేరు గోవా..గోవాలో గుంపు గుంపులుగా జనం కనిపిస్తున్నారు. తాజాగా ఓ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ఇది ' కోవిడ్ వేవ్‌కు రాయల్ వెల్‌కమ్.. భారీగా పర్యాటకులు అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో లో గొవాలొని బాగా బీచ్ దగ్గరలో రోడ్డుపై వందలాది మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు.. కరోనా వ్యాప్తికి కొంత మంది ప్రజలు తమ వంతు కృషి చేస్తున్నారంటూ హేళన చేస్తూ కామెంట్లు పెడుతున్నారు..
ఒకవైపు కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న నేపథ్యం లో జనాలు కొంచెం కూడా భయం లేకుండా క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్ సీజన్ కోసం గోవా వెళ్లిన పర్యాటకులతో సందడి నెలకొంది. పర్యటకులు భారీగా గోవాకు చేరుకోవడంతో మళ్ళీ గోవాలో కరోనా కేసుల పాజిటివ్ రేటు పెరిగిందని తాజా హెల్త్ బులిటెన్ లో పెర్క్కొన్నారు.గోవాలోని బీచ్‌ల్లో, పబ్‌ల్లో, నైట్‌క్లబ్‌ల్లో న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోవడానికి చేరుకున్నారు. అయితే గోవాలో పర్యటించాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్, లేదా ఆర్టీపిసిఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాల్సినే అన్న నిబంధన అమలులో ఉంది. అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.జనం గుంపులు గుంపులుగా ఒకే చోట ఉండకూడదని ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
ఆ వీడియో మీరు ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: