Viral Video : ఈ పిల్లి మాములుగా ఎంజాయ్ చెయ్యట్లేదుగా..

Purushottham Vinay
సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ వీడియోలు ఎప్పుడూ కూడా తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే..ఇక వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా ఉంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక సాధారణంగా పిల్లులు చాలా అందంగా ఇంకా ఫన్నీగా ఉంటాయి. అవి చిన్న వయస్సులో ఉన్నప్పుడు.. అవి చాలా అల్లరి చేస్తుంటాయి. చాలా మంది కూడా వ్యక్తులు పిల్లులను అశుభకరమైనవిగా భావిస్తారు.. కానీ కొంతమంది మాత్రం వాటిని ఇష్టంతో పెంచుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే పిల్లులు ఎంతగానో సందడి చేస్తుంటాయి. తమ పెంపుడు కుక్కలతో సైతం అవి ఆడుకుంటుంటాయి.ఇక వీటికి సంబంధించిన వీడియోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి.ఇక తాజాగా.. ఓ పిల్లి చిల్డ్రన్ పార్క్ లో తెగ ఎంజాయ్ చేసింది. 

ఇక ఇప్పుడు పిల్లి చలాకీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.ఇక సాధారణంగా..మీ చిన్నతనంలో మీరు స్లైడింగ్ పూల్‌లో ఆడుకోని ఉంటారు. ప్రతి పార్కులో కూడా చిన్న పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్ పూల్స్ అనేవి ఉంటాయి. వారు జారుడు బల్లా (స్లైడింగ్ పూల్) పై ఆడుకుంటూ జారుతూ ఆనందిస్తుంటారు. ఇక ఇలాంటి  సీన్లను మనం చూసేఉంటాం.ఇక ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో పిల్లి కూడా ఇక అలాంటిదే చేస్తోంది. స్లైడింగ్ పూల్‌పై పిల్లి ఎలా ఎక్కి ఎలా కిందికి జారిపోతుందో వీడియోలో మీరు గమనించవచ్చు.ఇక ఇలా ఆడుకుంటూ పిల్లి ఎలా ఎంజాయ్ చేస్తుందో మీరు చూడండి.ఆ పిల్లి స్లైడింగ్ పూల్ పైకి ఎక్కి జారుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోని చూసి చాలామంది నెటిజన్లు తమ బాల్యం గుర్తుకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.


https://twitter.com/buitengebieden_/status/1477338324624982018?t=_uhqwALX8rl5Bmt19IF45Q&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: