వామ్మో..మ్యాగితో ఇలా కూడా చేస్తారా?

Satvika
మ్యాగి అంటే అందరికి చాలా ఇష్టం.. చిటికెలో  తయారవుతున్న ఐటమ్ కావున ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటున్నారు. అందులో ఎన్నో రసాయాలు కూడా ఉన్నాయి. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురైనా కూడా వాటికి ఉన్న రుచి కారణంగా వీటి వినియోగం కూడా పెరుగుతుంది.. అయితే ఈ మ్యాగిని కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ ఒనర్స్.. వాటిని తినడానికి జనాలు కూడా ఎగబదడతారు. ఇప్పుడు మ్యాగికి సంబంధించిన ఒక వెరైటీ వంట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదే తందూరి మ్యాగి.. ఈ పేరు వినడానికి చాలా వింతగా ఉంది కదూ.. అవును..దానిపై నెగెటివ్ రియాక్షన్ వస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. స్ట్రీట్ ఫుడ్ ప్రమోట్ చేయడానికి అనికయిత్ లుతారా అనే యూట్యూబ్ ఛానల్ ముందుకొచ్చింది. ఈ ఛానల్‌లో నిర్వాహకులు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ప్రమోట్ చేస్తున్నారు.. అందులో ఈ మ్యాగి  ఐటమ్ అనేది బయటకు వస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

వీడియోలో మ్యాగీ తయారుచేసే క్రమంలో వ్యాపారి తొలుత మట్టి పాత్రలను కొలిమిలో ఉంచాడు. ఈ క్రమంలోనే గ్యాస్ అంటించి నిప్పు బాగా వచ్చేలా చేశాడు.. అందులో మంట మండుతుంది. అలా ఆ మ్యాగీ కుతకుత ఉడుకుతూ డిస్కో డ్యాన్స్ చేసేసింది. అది చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మ్యాగీని చంపేసినంత పని చేశారని చెప్పే ఉద్దేశంలోనే నెటిజన్లు రిప్ మ్యాగీ అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అలా మ్యాగి ఎలా డ్యాన్స్ చెస్తుంది. అనే ప్రశ్నలు అందరినీ ఆలోచనలో పడేస్తుంది. కొందరు రిప్ మ్యాగీ అని వివిధ రకాల కామెంట్ల తో హోరెత్తిపోయింది.. మీరు కూడా ఒకసారి ఆ మ్యాగిని మీరు కూడా చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: