జనవరి 1వ తేదీ.. చరిత్ర ఏంటో తెలుసా..?

Divya
కొత్త సంవత్సరానికి ప్రజలు ఆహ్వానం పంపేందుకు కేవలం కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నది. కానీ కరోనా వల్ల ఈ వేడుకలు జరుపుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. కానీ కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తారీకునే ఎందుకు జరుపుకుంటారు అనే విషయం పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు ఇప్పుడు వాటి గురించి చూద్దాం.
అయితే ఇంతకు ముందు జనవరి 1 వ తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేవారు కాదట. అయితే ఇది ఎప్పటినుంచి కొనసాగింది అంటే..1582 అక్టోబర్ 15 న ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే దీనికంటే ముందుగా అప్పటి ప్రజలు మార్చి 25న , డిసెంబర్ 25న న్యూ ఇయర్ని జరుపుకునే వారట. కానీ ఆ తరువాత రోమ్ కింగ్ అయిన నుమా పాంపిలస్ క్యాలెండర్ ను మార్చడం జరిగిందట. అప్పటి నుంచి ఇక జనవరి 1వ తారీఖున.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు.దీని వెనుక కథ ఏమిటో చూద్దాం.
మార్చి కి.. మార్స్ అనే గ్రహం పేరు పెట్టినది కూడా రోమన్ ప్రజలే.. వీరందరూ మార్స్ ను ఒక యుద్ధ దేవతగా భావిస్తారట. అయితే మొట్టమొదటిసారిగా క్యాలెండర్ తయారు చేసినప్పుడు కేవలం పది మాసాలు మాత్రమే ఉండేవట. అంటే కేవలం 308 రోజులు ఉండేవట. ఇక ఆ తర్వాత రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ క్యాలెండర్ ను మార్చడం జరిగింది.. అటు తరువాత జనవరి 1న కొత్త ఏడాదిని ప్రారంభించారు. అలా అలా రెండు నెలలు యాడ్ చేసి మొత్తం 12 నెలలు గా పొడగించారు. ఇక జూలియస్ సీజర్ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. 365 రోజులు గా ఒక ఏడాదిగా పరిగణించారట.
వీరి తర్వాత పోప్ గ్రెగొరీ 1582 లో సంవత్సరంలో ఒక లీప్ సంవత్సరం ఉన్నట్లుగా గుర్తించారు. అటు తరువాత క్యాలెండర్ ను మార్చి సరికొత్తగా సృష్టించారు. ఇక అప్పట్నుంచి జనవరి 1న వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: