వైరల్ : అంతరిక్షంలో హెయిర్ కట్టింగ్.. చూస్తే అవాక్కే?

praveen
సాధారణంగా అంతరిక్షం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే అంతరిక్షం నేపద్యంలో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు మిస్ చేయకుండా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు అంతరిక్ష నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో అంతరిక్షంలో వ్యోమగాములు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్న విషయాలను కూడా కళ్లకు కట్టినట్లుగా చూపించాయి ఎన్నో సినిమాలు. దీంతో దాదాపుగా అంతరిక్షంలో వ్యోమగాముల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై  అందరికీ క్లారిటీ ఉంటుంది.


 అయితే అంతరిక్షం నేపద్యంలో వచ్చిన సినిమాలు చూడడానికి ఎంత ఆసక్తి చూపుతే.. ఇక శాస్త్రవేత్తలు అంతరిక్షం నుంచి స్వయంగా వీడియోలు పంపితే ఇక అవి చూడటానికి అందరూ ఎగబడి పోతూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలా అంతరిక్షానికి సంబంధించిన వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. అయితే వ్యోమగాములు అంతరిక్షంలో కి వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోవటం కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భూమ్మీద రోజువారి జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ అంతరిక్షంలో కొన్ని నెలలపాటు ఎలా గడుపుతారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.

 ఈ క్రమంలోనే ఇటీవలే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన  వ్యోమగాములు ఒక వీడియో విడుదల చేశారు. అంతరిక్షంలో రోజువారీ వ్యాయామం ఎలా చేస్తారు  ఈ వీడియోలో చూపించారు. స్ఫేస్ స్టేషన్ లో కూడా రెండు గంటలకు వ్యాయామనికి ఎలాంటి మినహాయింపు లేదు.. స్పెస్  వాతావరణంలో కూడా ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది అంటూ వ్యోమగామి మౌరర్ ఒక వీడియో విడుదల చేశారు. ఇక మరో వీడియో నాసాకు చెందిన రాజాచారి జుట్టు కత్తిరిస్తూ కనిపించడం గమనార్హం.  ఇక దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: