హతవిధీ....ఏమిటీ వైపరీత్యం ?

Vennelakanti Sreedhar

పరాయి గడ్డనే సోంత గడ్డగా చేసుకున్న మేమెక్కడ...మా పరిపాలనానుభం ఎంత?..కంటి చూపుతో యావత్ భారతావనిని పరిపాలన సాగించిన మాకే ఈ అవమానమా... ఇది... అవమాన మనుకొందుమా..లేక పరాభవమా... అదియునూ కాకుంటే  శతృదుర్భేద్యమైన మా కోటలో పరాయు మూకలు చేసినా కుట్రయా... ఏమిటిదంతా..?
భారత రాజకీయాలలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న పార్టీ కాంగ్రెస్. దశాబ్దాల తరబడి  దేశాన్ని ఏలిన పార్టీ కూడా ఇదే. ప్రస్తుతం ఆ పార్టీ ప్రజల్లో  తన పట్టును నిలిపుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ ఝండా ను ఎగుర వేసేందుకు కూడా కష్టపడుతోంది. ఇది నిజం. మీరు నమ్మకపోతే సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూడండి.
కాంగ్రెస్  పార్టీ ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28 న నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లాగా ఈ రోజు కూడా  ఆ పార్టీ  సంస్థాగత దినోత్సవాన్ని నిర్వహించింది.ఈ రోజు జరిగిన పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ ఝడాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా అది కాస్తా స్తంభం నుంచి కిందకు జారి ఆమె చేతిలోపడిపోయింది.ఒక కాంగ్రెస్ కార్యకర్త సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు, సోనియా గాంధీ తాడును లాగడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత సోనియా గాంధీ, మరికొందరు కాంగ్రెస్ నేతలు పవన్ బన్సాల్, కేసీ వేణుగోపాల్ తదితరులు పార్టీ జెండాను పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శించారు.  ఒక కాంగ్రెస్ కార్యకర్త జెండాను సరిగ్గా వేయడానికి నిచ్చెనను ఉపయోగించి పోల్ పైకి ఎక్కాడు. ఈ వేడుకకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముందు  రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమాలలో  ఇలా అన్నారు. "భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేసిన పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నా"నని రాహుల్ గాంధీ  పేర్కోన్నారు.
"మనం కాంగ్రెస్- మన ప్రజాస్వామ్యానికి పునాది వేసిన పార్ట, ఈ వారసత్వం గురించి మేము గర్విస్తున్నాము. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు" అని కూడా ఆయన అన్నారు...ఇంతకీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఝండాను ఎప్పుడు ఎగుర వేస్తారు ?.. ఇది మాత్రం మీరు అడగకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: