వైర‌ల్ వీడియో : మ్యూజిక్‌ షూట్‌లో చేదు అనుభవం..సింగర్ కు ఏమైందంటే..?

N ANJANEYULU
ఈ మ‌ధ్య కాలంలో పాము కాటులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న‌, పెద్ద, పేద, ధ‌నిక అని తేడా లేకుండా ఏదో ఓ రూపంలో పాముకాటుకు గుర‌వుతూనే ఉన్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్ హీరో సైతం పాముకాటుకు గురై చికిత్స పొందారు. అదృష్ట‌వ‌శాత్తు అది విష‌పూరిత‌మైన‌ది కాక‌పోవవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పిన‌ది.
అయితే ఇటీవ‌ల పాములు, కొండ చిలువ‌లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ గా మారుతూ ఉన్నాయి. చాలా మంది పాముల‌ను ముద్దుపెట్టుకోవ‌టం, బెల్టులా ఒంటికి చుట్టుకునే వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో చూసాం. అదేమాదిరిగా  పాముతో సాహ‌సం చేద్దామ‌ని అనుకున్న ఓ యంగ్ సింగ‌ర్‌కు చేదు అనుభ‌వం ఎదురైన‌ది. పాముల‌తో క‌లిసి నిర్వ‌హించిన ఒక మ్యూజిక్ షూటింగ్ ఒక పాము గాయ‌నినీ ముఖంపై కాటేసింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో  వైర‌ల్‌గా మారిన‌ది.
వివరాల్లోకి వెళ్లితే.. అమెరికాలోని జేజెడ్ లేబుల్ రోక్ నేష‌న్ అనే సంస్థ యంగ్ సింగ‌ర్ మేతాతో ఒక మ్యూజిక్ వీడియో షూట్ ని ప్లాన్ చేసిన‌ది. ఇందులో భాగంగా  ఆ సింగ‌ర్‌ నేల‌మీద ప‌డుకుని.. పాముల ఒంటిమీద వేసుకుంటూ పాట‌లు పాడాలి. కానీ షూట్‌లో భాగంగా బ్లాక్ క‌ల‌ర్ దుస్తులు ధ‌రించిన మేతా మొద‌ట్లో కొన్ని పాముల‌ను శ‌రీరంపై వేసుకుని పాట‌లు పాడ‌టం ప్రారంభించిన‌ది. అయితే ఏమైందో ఏమో తెలియ‌దు కానీ అందులో ఒక పాము అమాంతం  ఒక్కసారిగా ఆమె ముఖం మీద కాటేసింది.  
ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ముఖంపై కాటు వేయ‌డంతో.. భ‌య‌ప‌డి పాముల‌ను ప‌క్క‌కు నెట్టేసిన‌ది గాయ‌ని. ఆ త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ది. అయితే మేతాను క‌రిచిన పాము విష‌ర‌హిత పాము అని స‌మాచారం. దీంతో  ఆమెకు ఎలాంటి ప్రాణ‌పాయం లేదు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ వీడియో సోష‌ల్ మీడియాలో పంచుకున్న మేతా.. మీ అంద‌రి కోసం మ్యూజిక్ వీడియోలు షూట్ చేస్తున్న‌ప్పుడు ఏమి జ‌రిగిందో తెలుసా అని చెప్పుకొచ్చారు. ఒక్క‌సారిగా ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారిన‌ది. అమెరికాలో టిక్‌టాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన మేతాకు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు చాలా మందే ఉన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: