నాగ్ తో అందుకు నో అంటున్న హీరోయిన్లు..

Satvika
టాలివుడ్ మన్మథుడు కింగ్ అక్కినేని నాగర్జున వెండి తెరపై ,ఇటు రియాలిటీ షో లతో బుల్లితెర పై కనిపిస్తూ తన హవాను కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా నాగ్ తెర పైకి తీసుకు వస్తున్న సినిమాలు ఏవి కూడా ప్రజలకు నచ్చలేదని తెలుస్తుంది. ఎంత ఫాస్ట్ గా వస్తాయొ అంతే వేగంగా వెనక్కి వెళతాయి. కానీ నాగ్ మాత్రం వెనక్కి తగ్గడు.. కరోనా తర్వాత నాగ్ రెండు సినిమాల లో నటించారు. ఆ సినిమాలు రెండు పెద్దగా పేరును తీసుకు రాలేదు..ఇప్పుడు మరో రెండు సినిమాల లో నటిస్తున్నాడు..

బంగార్రాజు.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత మరో సినిమాను లైన్ లో పెట్టారు. షూటింగ్ పనులను త్వరగా పూర్తీ చేసి వచ్చే నెలలో విడుదలకు సిద్దంగా ఉంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు.. ఇంతకు ముందు నాగ్ కనిపించని థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నాగ్ కు సెట్ అయ్యే ఒక అమ్మాయి హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రానికి హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారని తెలుస్తుంది.హీరోయిన్‌ పాత్ర ఒక గూఢచారి. ఇందుకోసం మొదట చందమామ కాజల్‌ అగర్వాల్‌ను మేకర్స్ సెలెక్ట్‌ చేశారని సమాచారం. కాజల్‌తో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ అమ్మడు మధ్యలోనే హ్యాంద్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అమలాఫాల్ కూడా అలానే చెప్పకుండా వెళ్ళిపోయింది.ఇప్పుడు చొనాల్ ను ఫిక్స్ చేయాలనీ భావిస్తున్నారు... మరి ఎవరూ నాగ్ సరసన నటిస్తారు అనేది ఆసక్తి కనబరుస్తున్నారు... రెండు సినిమాలు కూడా హిట్ అయ్యితే నాగ్ రేంజ్ వెరె లెవల్.. మరి సినిమా హిట్ అవ్వాలని మనం కూడా ప్రార్దించాలి.. చివరికి ఎమౌతుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: