కుక్కలు చాలా విశ్వాసాన్ని కలిగి వుంటాయి. అంతేకాదు కొంత మంది ఆపద లో ఉన్నారు అంటే అవి వెంటనే స్పందించి తక్షణ సాయాన్ని అందిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఎదురైంది. కుక్కల దగ్గర అప్పుడే పుట్టిన బిడ్డ వుంది.అది చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆ కుక్కలు మాత్రం వారి బిడ్డ లాగె చూసుకోవడం చూసిన వారంతా ఆష్చర్యానికి గురవుతున్నారు..
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన నార్త్
ఇండియా లో వెలుగు చూసింది.చత్తీస్‌గఢ్‌లో ముంగేలి జిల్లాలో లోర్మీ సరిస్టాల్ గ్రామంలోని ఈ దారుణం వెలుగు చూసింది. పోలాల్లో పసి పిల్లాడి ఏడ్పు వినిపించగా అటుగా వచ్చిన స్తానికులు షాక్ కు గురయ్యారు. కుక్కల మధ్య అప్పుడే పుట్టిన బిడ్డ ఉండటం చూసి భాద పడ్డారు. ఈ పని అర్ద రాత్రి ఎవరో చేసారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వార్త ఆ నోట ఈ నోటా పాకి అందరికి తెలియడం తో అందరు బాబును చూడటానికి భారీగా వచ్చారు. కొంత మంది మహిళలు అక్కున చెర్చుకొని బాబుకు పాలు పట్టించారు.ఒక తల్లి
కుక్క తన ఆరు పిల్లలతో ఆ నవజాత శిశువుని రాత్రి అంతా కాపాల కాసి బాబును తన బిడ్డ గా కాపాడింది.అక్కడ వాళ్ళు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థా నికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్నారు. బిడ్డను బింజ్వార్ శిశువును ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు చైల్ద్ వెల్ఫ్కేర్ వాళ్ళకు అందించారు. ఆ బిడ్డకు నామకరణం కూడా చేశారు.. ఎంతో చక్కగా వున్న పసి కందును ఇలా వదిలేసినందుకు భాధ పడాలి అంటూ పోలీసు అధికారి సోషల్
మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.. ఆ బిడ్డ తల్లి దండ్రులను వెతికే పనిలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.