మందుబాబులకు చక్కటి శుభవార్త తెలిపిన ప్రభుత్వం..!

Divya
మొన్నటి వరకు రాష్ట్రంలో మందు లేకుండా చేస్తామని చెప్పి .. నేడు మందుబాబులకు చక్కటి శుభవార్త అందించింది జగన్ ప్రభుత్వం. మద్యానికి సంబంధించిన పన్ను రేట్లలో మరోసారి మార్పులు చేస్తూ మందు బాబులకు శుభవార్త తీసుకొచ్చింది. నిజానికి మద్యం సేవించడం హానికరం అని ప్రతి ఒక్కరు చెప్పినప్పటికీ మందుబాబులకు మద్యం రుచి చూపించి ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయి అని పలువురు ప్రముఖులు వాపోతున్నారు.
వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్ లో మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు పూర్తిస్థాయిలో  భారీగా తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్.. ఫారిన్ లిక్కర్ పై 5 నుంచి 12 శాతం వరకు మద్యం ధరలు అద్దం ఉన్నాయని తాజాగా ప్రకటించింది.. ఇక మిగతా అన్ని రకాలపై  బ్రాండ్ లపై సుమారుగా 20 శాతం వరకు ధరలు తగ్గనున్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అతి పెద్ద ఉపయోగమే ఉందని చెప్పాలి.. అదేమిటంటే  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారాను  అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం..  వచ్చే వారం నుంచి అన్ని దుకాణాలలో అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

మద్యం ధర ఇప్పటికే ఇతర చర్యల వల్ల మద్యం వినియోగం కూడా  37 శాతం తగ్గిందని పేర్కొంది. ఇకపోతే అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో అమ్ముతున్న  మద్యం అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలే మరో పది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది.. ఇక కొత్త సంవత్సరం అంటే మందుబాబులకు పండగే అని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో మద్యంపై ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తగ్గిన ఈ మద్యం ధరల తో మందుబాబులు కొత్త సంవత్సరాన్ని మరింత కొత్తగా సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: