హానీమూన్ లో ట్విస్ట్.. షాక్ లో భార్య..
స్నేహితుల తో కలిసి వెల్దామని చెప్పిన భర్త మాటలు విని భార్య ఖంగుతింది. పెళ్ళికి ముందు 7నెలలు ఉందనగా ఈ ట్రిప్ గురించి ఇద్దరూ కలిసి తెగ ప్లాన్లు వేశారు. అనుకున్న విధంగా ఒక స్పాట్ ను ఎంచుకొని అక్కడ ఎలా ఎంజాయ్ చేయాలనీ ఆలోచిస్తుండగానే పెళ్ళి అయ్యింది. అనుకున్న విధంగా హనీమూన్ అనుకున్నారు. ఈ విషయం గురించి అబ్బాయి స్నేహితుల తో పంచుకున్నాడు.
ఆ ప్లేస్ పేరు వినగానే మేము అక్కడకు రావాలని అనుకుంటున్నాము. అందరం కలిసి వెల్దామని చెప్పారు. అతను వద్దని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు వినలేదు. స్నేహితుల కోరికను కాదనలేకపోయిన ఆ వ్యక్తి.. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆమెకు ఈ మాట వినగానే ఫ్యుజులు ఎగిరి పోయాయి. నీకు ఏమైనా పిచ్చి నా.. అంటూ కోపంతో ఊగిపోయింది. బండ బూతులు తిట్టింది. ఆ ఐడియా వచ్చినందుకు అతడ్ని తిట్టిపోసింది. అప్పటికి కూడా ఆ వ్యక్తి ఆమెను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాడు.. చివరికి ఫెయిల్ అయ్యాడు..