వైరల్ : బ్యాట్స్మెన్ దవడ పగిలిపోయింది?

praveen
కొన్ని కొన్ని సార్లు క్రికెట్లో బౌలర్లు వేసిన బంతులు బ్యాట్స్మెన్లను ఆశ్చర్యపరుస్తూ  గాయాలు చేస్తూ ఉంటాయి. ఇలా స్పీడ్ బౌలింగ్ ఇప్పటి వరకు కొంత మంది బ్యాట్స్మెన్లు గాయాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఇటీవల యాషెస్ సిరీస్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన చూస్తే పెద్ద ప్రమాదం తప్పింది అనే చెప్పాలి. ప్రస్తుతం యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ ఎంతో ఆసక్తి కరంగా జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.. ఎనభై ఒక్క ఓవరులో ఇంగ్లాండ్ బౌలర్ మార్కు వుడ్  వేసిన బీమర్ తో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ట్రెవిస్ హెడ్  దవడ పగిలిపోయింది.


 దీంతో మైదానంలో ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.. ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బీమర్ నేరుగా బ్యాట్మెంటన్ ట్రెవిస్ హెడ్ భుజం చేతుల వరకు వచ్చింది.  దీన్ని దీన్ని డిఫండ్ చేయడానికి ప్రయత్నించాడు ట్రెవిస్ హెడ్. అయినప్పటికీ 136 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి మొదట బ్యాట్ కి తాకి ఆ తర్వాత బ్యాట్స్మెన్ బ్లౌజులకి తాకి ఒక్కసారిగా దవడ కింది భాగాన్ని గట్టిగా తాకింది. దీంతో బ్యాట్స్మెన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవిలలాడి పోయాడు. ఇక వెంటనే షాక్ అయిన బౌలర్ మార్క్ వుడ్... ట్రెవిస్ హెడ్ దగ్గరకు చేరుకుని క్షమాపణ కోరాడు.



 అయితే ఇలా బంతి బలంగా దవడకు తగలడంతో అటు డగౌట్ లో కూర్చున్న ఆసీస్ ఆటగాళ్లు సైతం ఆందోళనకు గురయ్యారు.. ఇక వెంటనే మైదానంలోకి చేరుకున్న ఫిజియో అతని పరీక్షించారు  ఇక ఈ మ్యాచ్లో గాయం బారిన పడినప్పటికీ ట్రెవిస్ హెడ్ 152 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 298 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది  అంతేకాదు ట్రెవిస్ హెడ్ గబ్బ స్టేడియంలో అత్యంత వేగంగా సెంచరీ అందుకున్న ఆటగాడిగా కూడా అరుదైన రికార్డును సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: