గోల్ కీపర్ గా సీఎం.. చూస్తే షాకే?
అయితే సాధారణంగా ప్రజా ప్రతినిధులు అన్న తర్వాత ఏవైనా క్రీడా పోటీలను ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఈ క్రీడాకారులను ఉత్సాహ పరచడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు బ్యాట్ పట్టుకొని కాసేపు ప్రజాప్రతినిధులు ఆడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏకంగా హాకీ పోటీలను ప్రారంభించడానికి వెళ్తే ఏం చేస్తారు హాకీ రాక్ పట్టుకొని కాసేపు హాకీ ఆడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి మాత్రం వినూత్నంగా ప్రయత్నించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.
సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా పోటీలను ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే మైదానంలో సందడి చేస్తూ ఉంటారు. కానీ ఏకంగా ఒక ముఖ్యమంత్రి ఇటీవలే హాకీ పోటీలను ప్రారంభించడానికి వెళ్లి ఏకంగా గోల్కీపర్ అవతారమెత్తాడు. జలంధర్ లో జరిగిన సుర్జీత్ హాకీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ గోల్ కీపింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం పంజాబ్ సీఎవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బంతిని అడ్డుకునేందుకు సీఎం చరణ్ జిత్ ఎంతో చురుకుగా కదులుతూ కనిపించారు. యువతలో క్రీడా సంస్కృతిని పెంచేందుకే తాను ఇలా గోల్ కీపర్ గా మైదానంలోకి దిగాను అంటూ చరణ్ జిత్ సింగ్ తెలిపారు.