ఒక్క కాండానికి 839 చెర్రీ టొమాటోలు.. ఎక్క‌డో తెలుసా..?

N ANJANEYULU
టొమాటో దేశీయ కూరగాయల్లోనే కాదు.. ప్రపంచ దేశాలలో కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఎర్రగా అందంగా చూడముచ్చటగా కనిపించే టొమాటోలను తొలుత‌ ఇంగ్లాండ్ లో అందం కోసం పెంచుకునేవారట.  కాలక్రమేణ అది కాస్త‌  కూరగాయగా మార్పు చెందింది. ఇంగ్లాండ్ నుంచి భారతదేశంలోకి సుమారుగా 1850లో ప్రవేశించింది. తెలుగులో సీమ వంగ, రామములగ అని కూడ పిలుస్తుంటారు. ఇప్పుడు మనదేశంలో టొమాటో కూరలేని ఇల్లు, టొమాటో కూరలేని దుకాణం ఉండదని  చెప్పడంలో అతిశయోక్తి కాదు.
టొమాటోలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శక్తివంతమైన యాంటి యాక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. స‌ర్వ‌సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే  ఎలాంటి రోగం ద‌రిచేర‌ద‌ని, డాక్టర్ తో  అవసరం లేదని చెబుతుంటారు.   కానీ అన్నీ సీజ‌న్‌ల‌లో లభించే టొమాటోలు తీసుకుంటే డాక్టర్‌తో అవసరముండదనే చెప్పవచ్చు.  ఇదంత ఒక ఎత్త‌యితే.. ఒక టొమాటో చెట్టు గుబురుగా పెరిగి గుత్తులు గుత్తులుగా ఐదు నుంచి 6 కాయలు కాస్తూ.. ఇలా మొత్తం చెట్టు మహా అయితే ఒకేసారి 25 వరకు కాస్తుంటాయి. కానీ  ఓ వ్యక్తి నూత‌న  పద్దతిలో వ్యవసాయం చేసి.. ఒక చెట్టుకు ఏకంగా 839 కాయలు కాపించాడు.  ఈ చెట్టుకు పసుపు టొమాటోలు కాశాయి.  వీటిని చెర్రీ టొమాటోలుగా పిలుస్తారు. వీటిని స్నాక్స్ తయారు చేయడానికి కూడ ఉప‌యోగిస్తార‌ట‌.
బ్రిటన్ కు చెందిన  43 ఏళ్ల డగ్లస్ స్మిత్  అనే వ్యక్తి సాధారణ ఊహకు అందని ఘనత సాధించాడు. స్మిత్   ఐటీ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు తనకు ఇష్టమైన వ్యవసాయం సాగు చేయడం మొదలు పెట్టాడు. సాగు లో కొత్త పద్దతులను తీసుకొచ్చి  తాను పండించే పంట దిగుబడిని రికార్డు స్థాయిలో సాధిస్తున్నాడు.  గ్రీన్ హౌస్ పద్దతిలో చెర్రీ టొమోటో పంటను సాగు చేస్తున్నాడు. మార్చి నెలలో టొమటోల విత్తనాలను నాటాడు. మొక్కను పెంచడానికి స్మిత్ రోజుకు 3 నుంచి 4 గంటల సమయం వెచ్చించాడు. ఇప్పుడు ఆ టొమాటో మొక్కకు ఏకంగా 839 టొమాటోలు కాశాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడ ఈ మొక్క చోటు ద‌క్కించుకుంది.  దీనికి కారణం గ్రీన్ హౌస్ పద్ధతిలో సాగు చేయడమే కారణం అని స్మిత్  పేర్కొంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: