పదహారేళ్లకే ప్రపంచ రికార్డు.. ఏం చేసిందో తెలిస్తే షాకే?
సాధారణంగా పదహారేళ్ళ వయసులో ఎవరైనా ఏం చేస్తారు.. ఇంకేం చేస్తారు చదువుకుంటూ స్నేహితులతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. అంతే కాదు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ ఉంటారు కానీ ఇక్కడ ఒక బాలిక మాత్రం పదహారేళ్ళ వయసు లో సంచలనం సృష్టించింది. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. పదహారేళ్ళ వయసు లోనే ప్రపంచ రికార్డు సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం ఇక ఈ 16 ఏళ్ల బాలిక కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పదహారేళ్ల అమ్మాయి సుచేత సతీష్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇటీవల చోటు దక్కించుకోవడం గమనార్హం ఇంతకీ ఈ ప్రపంచ రికార్డు కొట్టేయడానికి బాలిక ఏం చేసింది అని అనుకుంటున్నారా.. ఆ బాలిక పాట పాడింది. అదేంటి పాట పాడిన దానికే గిన్నిస్ బుక్ రికార్డు ఇచ్చేస్తారా అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అయితే ఈ బాలిక పాట పాడింది కేవలం ఒక నిమిషమో ఐదు నిమిషాలో కాదు ఏడు గంటల ఇరవై నిమిషాలు అది కూడా 102 భాషలలో ఈ పాట పాడి ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ బాలిక . ఆగస్టు 19 వ తేదీన దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ ఘనత సాధించింది. ఇటీవలే గిన్నెస్ బుక్ ప్రతినిధులు ఈమెకు సర్టిఫికెట్ అందజేసారు. కేరళకు చెందిన ఈమె మూడేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకుంటూ ఉండటం గమనార్హం.