టీమిండియా బ్యాట్స్ మ్యాన్ హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ లుక్ పాకిస్తాన్ లో ఉండటం ఏంటి? ఇప్పుడు ఐపిఎల్ లో సిక్స్ లు బాదుతున్నాడుగా.. అనుకోని ఆశ్చర్య పోతున్నారా?అయితే ఈ స్టోరీ చదవండి.ఇక రోహిత్ శర్మ లాంటి పోలికలతో వున్న వ్యక్తి ఫోటో వైరల్ అవుతుంది.ఇక చాలా మంది సెలెబ్రెటీలు లాగా వున్న ఫోటోలు కూడా గతంలో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు పాకిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తి అచ్చం రోహిత్ శర్మ లాగానే వున్నాడు.పాకిస్థాన్‌లో ఒక వ్యక్తి 'షర్బత్' తాగుతూ దాన్ని ఆస్వాదిస్తున్న ఫోటో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో వున్న వ్యక్తి అచ్చం రోహిత్ శర్మ ముఖంతోనే కాకుండా అతని ప్రవర్తనతో సరిపోతుంది.ఖచ్చితంగా వీరిద్దరికీ కూడా ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఫోటోలో, మనిషి కప్పులోంచి ఆలు బుఖారా (ప్లం) షర్బత్ తాగుతూ, సన్ గ్లాసెస్ ఇంకా టోపీ ధరించి కూర్చుని కనిపించాడు.
ఫోటోను షేర్ చేస్తూ, షిరాజ్ హసన్ అనే యూజర్ ఇలా మెన్షన్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు."అంతర్జాతీయ క్రికెటర్లను సందర్శించడానికి పాకిస్తాన్ సురక్షితం కాదని ఎవరు చెప్పారు? రావల్పిండి సద్దర్ వద్ద ఆలు బుఖారా (ప్లం) ఒక గ్లాసు షర్బత్ తాగుతూ ఆస్వాదిస్తున్న స్టార్ ఇండియన్ ప్లేయర్ రోహిత్ శర్మను చూశాను."అని పోస్ట్ పెట్టాడు.ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంకా యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ముంబై వరుస మ్యాచ్ లు ఓడిపోతుంది. అందుకే ఈ ముంబై ఇండియన్స్ స్కిప్పర్‌కు కూల్ డ్రింక్ అవసరమని యూజర్లు అనేక జోక్ లు వేస్తూ మీమ్స్ చేస్తున్నారు.ఒక యూజర్ "సాస్తా రోహిత్ శర్మ" అని ట్వీట్ చేశాడు.మరొకరు "అతను తిరిగి సమీకరించడానికి ఇంకా ముంబై ఇండియన్స్ అదృష్టాన్ని ఎలా మారుస్తాడో ఆలోచించడానికి అతను అక్కడకు వెళ్లాడు !!"అని ట్వీట్ చేశాడు.ఇక ఐపిఎల్ రెండో ఎడిషన్ విషయానికొస్తే, ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత మంచి ఆరంభాన్ని పొందడానికి కష్టపడుతోంది. 2018 తర్వాత ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే మొదటిసారి.
https://twitter.com/ShirazHassan/status/1442507923414925322?s=19