ప్రజలకు గమనిక :కరెంట్ కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తోంది..?

MOHAN BABU
మా ఇంటికి 150 రూపాయలు వచ్చేది కరెంటు బిల్లు. రెండు మూడు నెలల నుంచి 800 వస్తున్నది. అసలెందుకిలా జరుగుతుంది. ఏం జరిగిందో ఏమో ఇంట్లో రెండు లైట్లు  ఒక ఫ్యాను వాడుకున్నందుకు ఇంత బిల్ వస్తుంది. ఆ కరెంటు మీటర్ వైపు చూస్తేనే భయపడ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ మీటర్ కి ఏమైనా దెయ్యం పట్టిందా. ఏమో పట్టే ఉంటుంది.. ఆ కరెంటు మీటర్ లో రీడింగ్ చాలా వేగంగా తిరుగుతూ బిల్లు వస్తోంది. కరెంటు మీటర్ ఏ కదా రీడింగ్ తిరగకపోతే ఏం తిరుగుతుంది అనుకుంటున్నారు కదూ.. అవును కరెంట్ మీటర్ లో రీడింగ్  మాత్రమే తిరుగుతుంది. అది ఎలా తిరుగుతుంది. మనం కరెంటును ఉపయోగించినప్పుడు మాత్రమే తిరుగుతుంది. కానీ ఈ యొక్క మీటర్ లో  కరెంటు ఉపయోగించకుండా దానికి అదే రీడింగ్  పెరుగుతోంది.

దీంతో అది చూసిన వ్యక్తి షాక్ కు గురయ్యారు. ఇంతకీ ఘటన ఎక్కడ జరిగింది. కరెంట్ మీటర్ దానికదే ఎందుకు తిరుగుతుంది.. తెలుసుకుందాం..? వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణం అజిత్ అనే వ్యక్తి షాపులో ఉండేటటువంటి కరెంట్ మీటర్ ఉంటుంది. అయితే ఈ మీటర్ లో అంతకుముందు చాలా రోజుల నుంచి 150 నుంచి 180 రూపాయల బిల్లు మాత్రమే వచ్చేదట. కానీ రెండు మూడు నెలల నుంచి దీనికి బిల్లు  2000 రూపాయల నుంచి 3000 వస్తుందని ఆ వ్యక్తి వాపోయాడు. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని అనుకున్నాడు. మీటర్ కు ఉండే కరెంట్ వైరును పూర్తిగా తొలగించాడు. మీటర్ ని పక్కన ఉంచాడు. కానీ ఆ మీటర్ లో కనెక్షన్ లేకున్నా రీడింగ్ లో నెంబర్లు మాత్రం పడుతూనే ఉన్నాయి. దీంతో షాప్ వ్యక్తి  షాక్  కు  గురయ్యాడు. కరెంటు లేకున్నా మీటర్ లో రీడింగ్ ఎలా వస్తుందని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆఫీసర్లను పిలిచి చూపించాడు

 దీన్ని చూసిన అధికారులు  దీనిని చెకింగ్ కోసం పంపించాలని అన్నారు అని ఆ వ్యక్తి తెలిపాడు. అయితే అధికారులు వచ్చి దాని కనెక్షన్ పూర్తిగా తీసేసి ఒక ఐదు నిమిషాలు గమనించారు. 5 నిమిషాల్లో 14 యూనిట్లు బిల్లు చూపిస్తుందని వారు ఆశ్చర్యపోయారట. దీంతో అధికారులు ఈ మీటర్ లో ఏదో సమస్య ఉంది సరిచేయాలని షాప్ వ్యక్తితో అన్నారని సమాచారం. అయితే ఈ అన్నా దీన్ని గుర్తుపట్టాడు కాబట్టి తెలిసిపోయింది. ఇలా  చాలా మంది ప్రజల ఇళ్లలో  మీటర్లు ఎలా తిరుగుతున్నాయో ఒక్కసారి మీటర్ పై దృష్టి వేయాలని ఇండియన్ హెరాల్డ్ కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: