సీసీ కెమెరాలు.. ఉన్నాయో లేవో మనమే ఇలా చెక్ చేసుకోవచ్చు..!

Divya
టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన దగ్గర ఉన్న సమాచారం మనకి తెలియకుండానే.. వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఇలా జరుగుతుందని చాలా మందికి తెలియదు. ఇక ఇప్పుడు ఎక్కువగా అందరినీ భయపెడుతున్న విషయం ఏమిటంటే.. స్పై కెమెరాలు ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వీటిని.. ఇప్పుడు పలుచోట్ల ఉపయోగించి సీక్రెట్ గా అశ్లీల చిత్రాలను షూట్ చేసి వాటితో డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు.
ఇక ఇలాంటి ఘటనల బారిన పడకుండా మనం కొన్ని జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. ఒకప్పుడు స్పై కెమెరాలు సెట్ చేసుకోవడానికి కొన్ని ప్రదేశాలు మాత్రమే అనుగుణంగా ఉండేవి. కానీ ఇప్పుడు స్విచ్ బోర్డ్ లపై, వాల్ పెయింట్స్ , పెన్ కెమెరాలు వంటివాటిలో అమర్చుతున్నారు. అందుకే ఎక్కడైనా వెళ్లిన చోట ప్రతి వస్తువును బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి.
మనం ఏదైనా రూమ్ లో కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా నల్ల చుక్క లాంటిది కనిపిస్తుందేమో చుట్టూ చూసుకోవాలి. ఒకవేళ అనుమానం వస్తే విద్యుత్ సరఫరాను ఆఫ్ చేస్తే.. ఆ స్పై కెమెరా.. పనిచేయడం ఆగిపోతుంది.ఒకవేళ.. స్పై కెమెరా కు ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల మన మొబైల్స్ లో కాల్స్ డిస్టబ్రేషన్ అవుతాయి. ఒకవేళ మనం ఫోన్ ఎవరికైనా చేసినప్పుడు మొబైల్ సిగ్నల్ సరిగ్గా లేకపోయినా అక్కడ  ఏదో ఉన్నట్లుగా గుర్తించాలి.
ఇక ఇలాంటి కెమెరాల ఉన్నట్లుగా కనిపెట్టడానికి హెడెన్ కెమెరా డిటెక్టర్.. యాప్ ద్వారా కూడా ఇలాంటి స్పై కెమెరాలను కనిపెట్టడానికి సహాయపడతాయి. ఒక్కోసారి మనం చూసుకునే అద్దంలో కూడా స్పై కెమెరాలు పెట్టే ప్రమాదం ఉంది. ఇక మిర్రర్ ని మనం చేతితో తాకినప్పుడు గ్యాప్ కనిపిస్తే అది నిజమైన అద్దం కాకపోవచ్చు.  మిర్రర్ లో నైట్ చీకటిగా ఉన్నప్పుడు కూడా స్పై కెమెరాను మనం కనిపెట్టవచ్చు.. ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ చేసి , గది మొత్తం  వెతికితే కచ్చితంగా స్పై కెమెరాలను మనం గుర్తించే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: