వామ్మో.. 2038 నాటికి ప్రపంచం రివర్స్ కాబోతోందట..!

Divya
మన జీవితం ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలియని పరిస్థితులలో.. ఇక ప్రపంచం ఎప్పుడు..? ఏమవుతుందో..? ఎలా తెలుస్తుంది..? కానీ ప్రపంచం 2038 వ సంవత్సరానికి రివర్స్ కాబోతోంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అదేమిటంటే ఇప్పుడు పని చేస్తున్న ఎన్నో డిజిటల్ యంత్రాలు కూడా ఆ సంవత్సరం వచ్చేసరికి రివర్స్ లో పనిచేయడం మొదలు పెడతాయట.. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే..1970 వ సంవత్సరం జనవరి 1వ తేదీన టెక్నికల్ సైంటిస్టులు గడియారంలో సమయాన్ని 00:00:00 అని ఒక UTC యూనిక్ కోడ్  తో ప్రారంభించారు. అయితే ఈ సాఫ్ట్ వేర్  ని కేవలం 32-బిట్ ఇంటిజర్ లో సెట్ చేయడం గమనార్హం. అంటే ఇంటిజర్ యొక్క కోడ్ చాలా చిన్నది..కాబట్టి 2038 జనవరి 19వ తేదీ మంగళవారం 03:14:07 UTC సమయం దాటి పోయిన తర్వాత ,ఈ కోడింగ్ ఆగిపోతుంది. ఇక సమయం ముందుకు సాగదట.. ఇందుకు గల కారణం ఏమిటంటే.. ఇంటిజర్ కు అంతకంటే మించి టైం లెక్కించే అంత కెపాసిటీ  లేదు..

నిజానికి భూమిపై కాలం ఆగకపోయినప్పటికీ , డిజిటల్ యంత్రాల్లో మాత్రం ఖచ్చితంగా కాలం ఆగిపోతుంది.. ఎందుకంటే సైంటిస్ట్ లు  తయారు చేసిన ఇంటిజర్ లో 1970 జనవరి 1 నుంచి 2,14,74,83,647 సెకండ్ లతో మాత్రమే నిండి ఉంటాయి.. ఇక అంతకు మించి నింపు సెకండ్ల ను నింపుకోవడం ఇంటిజర్ తో సాధ్యపడదు. ఇక్కడ మరో సమస్య ఏమిటంటే, డిజిటల్  సమయం ఆగిపోవడం ఒక సమస్య అయితే , అది కాస్త రివర్స్ లో తిరిగి వెనక్కు కౌంట్ అవ్వడం అతి పెద్ద సమస్యగా మారబోతోంది.. మనం 1970 జనవరి 1 నుంచి డిజిటల్ టైం వచ్చింది  కాబట్టి తిరిగి లెక్క ఆ సంవత్సరం చేరుకునే వరకు రివర్స్ లో  కౌంట్ చేయబడుతుందన్నమాట.

అంటే రోజు రోజుకి కూడా సెకండ్లు తగ్గిపోతూ ..2106 సంవత్సరం నాటికి ఫిబ్రవరి 7 ఆదివారం 06:28:15 UTC కి సెకండ్ల వ్యాల్యు జీరో అవుతుంది.. ఆ తర్వాత మళ్లీ జీరో నుంచి డిజిటల్ టైం కౌంట్ అవుతుంది.. దీనివల్ల ప్రపంచ మనుగడ ఆగకపోయినా, మనుషులలో అల్ల కల్లోలం సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయి.. అంతేకాదు ఈ సమస్య వల్ల డిజిటల్ పరికరాలన్ని ఎలా పనిచేస్తాయి.. అనే సమస్య శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారింది. నిజానికి అన్ని రకాల సాఫ్ట్ వేర్లు ఈ సమస్యకు ప్రభావితం అయ్యే ప్రమాదం అయితే ఉండదు కానీ, డిజిటల్ యంత్రాలు మాత్రం దెబ్బతింటాయని , అప్పుడు ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోక తప్పదు అంటూ సైంటిస్టులు చెబుతున్నారు..
ఒకవేళ ఈ సమస్య ను నిలిపివేయాలి అంటే, ఇప్పటికే డిజిటల్ పరికరాలు అయినటువంటి కంప్యూటర్లు, మొబైల్స్ ,విమానాలు ఇలా అన్నింటిలో కూడా 32-bit ఇంటీజర్ వాల్యూ సిస్టంను డిజిటల్ పరికరాలలో తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని.. పైగా అంత తేలిగ్గా రూపొందించడం సాధ్యపడదు.. అంతేకాదు ఈ టైమింగ్ ఎన్నింటిలో అమర్చబడి ఉందో కూడా తెలుసుకోవడం చాలా కష్టం అని అంటున్నారు సైంటిస్టులు.. ఈ సమస్యకు కచ్చితంగా సొల్యూషన్ లేదని కూడా సైంటిస్టులు చేతులెత్తేశారు..అయితే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: