వైరల్ : ఎస్కలేటర్ మీద వెళ్తున్న మహిళను తన్నిన వ్యక్తి..చివరకు..?

Divya
ఇటీవల కాలంలో చాలా వరకు ఎన్ని అంతస్తులు కలిగిన భవనాలలో ఒక అంతస్తు నుండి మరొక అంతస్తు కు వెళ్ళడానికి అత్యంత సులభమార్గం ఎస్కలేటర్ ను ఎంచుకున్న విషయం తెలిసిందే. వీటిని షాపింగ్ మాల్స్ లో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అంతేకాదు ఎయిర్పోర్ట్స్ రైల్వే స్టేషన్స్ లో కూడా ఎస్కలేటర్లును ఇటీవల వినియోగిస్తున్న విషయం తెలిసిందే. పోతే ఇటీవల జరిగిన ఒక దారుణమైన ఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది అంతేకాదు ఆ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేంటో పూర్తిగా తెలుసుకుందాం..

తాజాగా అమెరికాలోని బ్రూక్లిన్‌ అనే ప్రాంతం లో ఒక  దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్కలేటర్ మీద వెళ్తున్న ఒక  మహిళను ఓ వ్యక్తి వెనక్కి తిరిగి అత్యంత దారుణంగా ఆ మహిళలు కాలితో తన్నాడు.దీంతో ఆమె సడన్ గా భయపడి పోయి పట్టుకోవడానికి కూడా సపోర్ట్ లేక కాలుజారి కింద పడిపోయింది. ఇక ప్రస్తుతం ఈ సీసీ టీవీఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో  వైరల్ కాగా.. ఆ నిందితుడి కోసం పోలీసులు తెగ గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఎస్కలేటర్ అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దగ్గరలో ఉన్న బ్రూక్లిన్‌లో వున్న  అట్లాంటిక్ ఎవ్‌-బార్‌క్లేస్ సెంటర్ స్టేషన్‌లో ఒక  మహిళ (32), ఓ వ్యక్తి ఎస్కలేటర్ మీద  పై అంతస్తుకు వెళ్తున్నారు. ఆ సదరు వ్యక్తి ఆ మహిళ కన్నా కొన్ని మెట్లు మీదకు వేగంగా పైకి  వచ్చాడు.. అయితే సడెన్ గా అతను వెనక్కి తిరిగి ఆమెను  కాలితో తన్నాడు. దీంతో ఆమె ఎస్కలేటర్ నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది.

ఇకపోతే ఆ మహిళకు కాళ్లు, చేతులు,  వెన్నెముకకు గాయాలు కాగా.. ఆమెకు చికిత్స అందించడంబ్కోసం  పోలీసులు ప్రయత్నించారు. కానీ చిన్న  గాయాలు అయ్యాయని, తనకు ఎలాంటి చికిత్స అవసరం లేదని ఆ మహిళ  చెప్పింది. అయితే పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: