స్మశానంలో ఒంటరిగా మహిళ.. అస్థిపంజరాలతో అలా చేస్తూ..!

MOHAN BABU
 అది మిట్టమధ్యాహ్నం ఎవరూలేని సమయం. ప్రశాంతంగా ఉన్న స్మశానం.. వేగంగా గాలి వీస్తోంది.. అంతలోనే అక్కడికి ఒంటరిగా ఒక మహిళ వచ్చింది.. ఆ స్మశానంలో ఎన్నో అస్తిపంజరాలు వాటి దగ్గరికి వెళ్ళింది ఆ మహిళ.. అక్కడికి ఆమె ఎందుకు వెళ్ళింది.. ఏం చేస్తోంది.. అస్తిపంజరం ఎందుకు పట్టుకుంటుంది.. వాటితో అలా ఎందుకు చేస్తోంది.. తెలుసుకుందామా..?  ప్రతి మనిషి  తన చావు చివరి తర్వాత చేరే ప్రదేశం అది. అక్కడికి వెళితే అన్ని రోదనలు వినబడతాయి. మనం ఆ స్మశానానికి వెళ్ళేది మనవాళ్లు ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలు  చేయడం కోసం మాత్రమే వెళ్తాం. కానీ మామూలుగా ఒక్కరిని అక్కడికి వెళ్ళమంటే ఎవరు వెళ్లారు. ఇంకా రాత్రి సమయంలో, మధ్యాహ్న సమయంలో ఎవరూ లేకుండా ఉన్నప్పుడు స్మశాన వాటికలు  చాలా భయానకంగా ఉంటాయి. వింత వింత శబ్దాలతో, కుక్కల అరుపు లతో ఆ ప్రదేశమంతా అదో రకంగా ఉంటుంది.. అయితే ఈ స్మశానం గురించి ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా..

వివరాల్లోకి వెళితే..? యూకేలో ఒక మహిళ స్మశానంలోకి వెళ్లిన చిత్రం చూస్తే సోషల్ మీడియాలో నిజంగా అంత షాక్కు గురవుతున్నారు. ఏదైనా దయ్యం కనిపించింది అనుకునేరు.. కాదు కాదు.. అక్కడికి వెళ్లి ఒక సన్యాసి చేసిన పని  ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.. మనం దీన్ని ఫోటోలు చూస్తున్నాము కానీ డైరెక్ట్ గా చూసి ఉంటే భయంతో పరుగులు పెట్టే వాళ్ళం.. యూకే నగరంలోని  హల్క్ సిటీలో ఒక స్మశానవాటికలో  మధ్యాహ్నం ఒక సన్యాసి అస్థిపంజరాలు తీసుకొని వాటిని హత్తుకోవడం, వాటితో నృత్యాలు చేయడం, ఆడుకోవడం మాట్లాడడం చేస్తోంది. దీంతో ఆమెను చూసినవారంతా  షాక్ తిన్నారు.

ఈ సంఘటనను చూస్తూ చాలా మంది జనాలు అక్కడ గుమిగూడారు. ఆ మహిళ  సన్యాసి లాగా దుస్తులు వేసుకొని, తలపై కండువా కూడా ధరించి స్మశాన  వాటికలో అలా చేస్తూ  ఒక వ్యక్తి కెమెరాలో పడింది. ఆ వ్యక్తి ఆ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. అయితే  అస్తిపంజరాలతో ఆడుకోవడం ఆమెకు కొత్తేమీ కాదని, అమెరికాకు చెందినటువంటి లితియో తెలిపింది. అస్థిపంజరాలు అంటే తనకు చాలా ఇష్టమని, తన స్నేహితుడు అని చెప్పుకొచ్చింది. ఆస్తి పంజరానికి బెన్నీ అనే ముద్దుపేరు కూడా పెట్టడం ఆశ్చర్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: