వైరల్ వీడియో : రనౌట్ అవకాశం.. అంతలో ఊహించని ట్విస్ట్?

praveen
క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలా క్రికెట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు మైదానంలో కొన్ని కొన్ని సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటుంది. స్టేడియంలో ఆటగాళ్లను ప్రోత్సహించే అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి పరుగులు పెట్టుకుంటూ రావడం తమ అభిమాన క్రికెటర్లను కలవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఇలాంటి ఘటనలు  ఇటీవల  ఇంగ్లాండ్  టీమ్ ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో  జరిగి ఏకంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 అయితే చాలా మటుకు ఇలా అభిమానులు మైదానంలోకి రావడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సార్లు జంతువులు సైతం మైదానంలోకి పరుగులు పెట్టుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు మైదానంలో ఆటగాళ్లు భయంతో పరుగులు పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటామ్. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఐర్లాండ్ క్రికెట్ క్లబ్ లో జరుగుతున్న ఒక మ్యాచ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక బుజ్జి కుక్క చేసిన పని అందరిని పరుగులు పెట్టేలా చేసింది అని చెప్పాలి.

 ఐర్లాండ్లోని బ్రెడీ క్రికెట్ క్లబ్ మైదానంలో బ్రేడి,సీఎన్ఎస్  మధ్య ఉమెన్స్ సెమి ఫైనల్ మ్యాచ్ జరిగింది  . అప్పటికే వర్ష సూచన ఉండడంతో 20 వరకు జరగాల్సిన మ్యాచ్ కాస్తా 12 ఓవర్లకు కుదించారు. ఇలా ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో 9 ఓవర్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  ఏకంగా ఒక రనౌట్ చేసే అవకాశం ఉన్న సమయంలో మైదానంలో  ఒక్క బుజ్జి కుక్క యజమానిని నుంచి తప్పించుకొని పరుగులు తీసుకొని వచ్చింది. ఇక ఏకంగా వికెట్లను కూడా పడగొట్టింది. ఈ క్రమంలోనే ఫీల్డర్లు అందరూ ఆ కుక్కను పట్టుకోవడానికి పరుగులు పెట్టారు  ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కుక్క యజమాని ఆ కుక్కను తీసుకెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: