వైరల్ : దేవుడున్నాడు అనడానికి నిదర్శనం ఇదేనేమో..?

Divya
ఈ సృష్టిని సృష్టించిన వాడు దేవుడు అని కొంతమంది నమ్మితే.. హేతువాదులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.. వీరు ఎన్నటికీ దేవుడు ఉన్నాడు అని చెప్పిన సందర్భాలు లేనేలేవు.. కానీ ఈ ఒక్క వీడియో చూస్తే మాత్రం హేతువాదులు కూడా దేవుడు ఉన్నాడేమో..ఆయనకు సహాయం చేయాలనిపిస్తే ఇలాగే జరుగుతుందేమో అంటూ చూసినవారు అనక తప్పదు.. ఆ వీడియో ఏంటి..? ఆ వీడియోలో ఏముంది.. అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం..
సాధారణంగా ఒక్కో సారి మన కళ్ళ ముందు జరిగే కొన్ని సంఘటనలు చూసి కూడా మనం ఆశ్చర్యపోతుంటాము. అంతే కాదు వాటి నుంచి తేరుకోవడానికి మనకు నిజంగా కొంచెం సమయం పడుతుంది అని చెప్పాలి. తాజాగా ఒక సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.. ఒక భయంకరమైన కోబ్రా కాటు నుంచి ఒక బాలుడు తప్పించుకొని దేవుడు ఉన్నాడు అంటూ నిరూపించాడు.. ఇక అసలు విషయానికి వస్తే.. ఒక బాలుడు వాళ్ల కిరాణా అంగడిలో తన స్మార్ట్ ఫోన్ తీసుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.. అయితే అక్కడ ఉన్న టేబుల్ మీద కాస్త నడుము వాల్చాలని  అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా హుటాహుటిన లేచి బయటకి పరిగెత్తాడు.
బాలుడు లేచిన సెకండ్ల వ్యవధిలోనే ఒక ఎలుక కిరాణ అంగడి సందులో నుంచి బయటకు రావడం, దాని వెనకాల ఒక నాగుపాము రావడం వీడియోలో గమనించవచ్చు.. ఇక ఎలుకను వేటాడుతూ వచ్చిన ఆ పాము.. ఒకవేళ బాలుడు అక్కడే ఉన్నట్లయితే కచ్చితంగా ఆ పాముకాటుకు గురి అవ్వాల్సి వచ్చేది.. ఇక ఈ పాము, ఎలుకల గొడవలో ఆ చిన్నారి తృటిలో ప్రాణాలను దక్కించుకున్నాడు.. ఇక భగవంతుడే ఆ బాలుడిని కాపాడాడు అని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ సీసీటీవీ ఫుటేజ్ ను భారత జనతా పార్టీ నేత అయిన హితానంద శర్మ ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇది కాస్తా వైరల్ గా మారింది.
అంతేకాదు ఆయన ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. కింద దేవుడు రక్షించాలని అనుకుంటే ప్రాణానికి ఏ ప్రమాదం వాటిల్లదు అంటూ కామెంట్ చేయడంతో ఇది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక అదృష్టవంతులను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: