వైరల్ : టిఫిన్ హోటల్ కరెంట్ బిల్లు.. రూ.21 కోట్లు..!!

Divya
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను పెంచుతామని ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక టిఫిన్ హోటల్ వారికి ఏకంగా రూ.21 కోట్ల కరెంట్ బిల్లు ఇచ్చి అధికారులు ఆమెకు కరెంట్ షాక్ నే ఇచ్చారని తెలుస్తోంది.. ఈ కరెంటు బిల్లు చూసిన హోటల్ యజమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. రోజుకు వెయ్యి రూపాయలు కూడా సంపాదించలేని ఆ హోటల్ యజమాని కి అంత కరెంటు బిల్లు రావడంలో ఆమె అధికారులను ప్రశ్నించింది.. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలంలోని చింతలపూడిలో ఒక టిఫిన్ హోటల్ యజమానికి కరెంట్ బిల్లు చూపించి, అధికారులు షాక్ ఇచ్చారు. కాకపోతే పట్టణానికి చెందిన సాయి నాగమణి అనే ఒక మహిళ కొత్త బస్టాండ్ సమీపంలో ఒక టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. ఆగస్టు నెల కు సంబంధించిన విద్యుత్ బిల్లు ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లును ఆమె చేతిలో పెట్టడంతో ఆమె ఒక్కసారిగా నివ్వెర పోయింది. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం నాడు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగి బిల్లులను సరి చేశారు.

మీటర్ లో సాంకేతిక లోపం కారణంగా బిల్లు తప్పు వచ్చిందని అధికారులు తేల్చారు.. అంతేకాదు సాంకేతిక లోపాన్ని సరి చేసినట్లు కూడా ట్రాన్స్ కో  ఏఈ శంకర్ రావు తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, దీనికి సంబంధించి కొత్త బిల్లును వినియోగదారులకు అందజేస్తామని తెలిపారు.. ఇటీవల చాలా వరకు విద్యుత్ మీటర్ లకు రీడింగ్ సమయంలో మీటర్ లో కానీ ,మీటర్ రీడింగ్ మిషన్ లో కానీ కొన్ని సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కు చెందిన ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ జనార్దన్ రావు తెలపడం జరిగింది. ఇక బిల్లు తీయడంలో  నిర్లక్ష్యం వహించినా కూడా మీటర్ రీడర్ ప్రభాకర్ ను విధుల నుంచి తొలగించాము అని, చింతలపూడి ఏఈ ను కూడా సస్పెండ్ చేశామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: