ఒక్కసారిగా విరిగిపడ్డ కొండ చరియలు... ఆ తర్వాత ?
వర్షాల వలన కొన్ని సార్లు కొండలు విరిగి పడుతుంటాయి..ఆ సమయంలో వాహనాలు ఏమైనా రోడ్డుపై వెళుతుంటే ఇంకా అంతే సంగతులు. అయితే ఈ మధ్యనే జరిగిన సంఘటన వాహనదారులను వణికిస్తోంది. సిమ్లాలో జాతీయ రహదారి వైపు వెళ్తున్న వాహనదారులకు సడన్ గా జరిగిన ఒక సంఘటన షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏమి జరిగిందంటే, వర్షాలకు బాగా తడిసిన అక్కడ కొండలు జ్యోతి అనే ప్రదేశం దగ్గర విరిగి రోడ్డు పైకి దూసుకొచ్చాయి. కొండా విరిగి పడే సమయానికి ఆ హైవే రోడ్డుపై చాలా వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఒక్క వాహనం కానీ లేదా మనిషికి కానీ ఒక్క దెబ్బ తగల్లేదు. దీనితో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్కడున్న వారందరికీ ప్రాణభయం కలిగేలా చేసింది ఆ సంఘటన.
అంత భయంతోనూ కొంతమంది ఘటనను వీడియోలు తీయడం విడ్డూరంగా ఉంది. అయితే ఈ సంఘటన కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగి పరిస్థితి సమీక్షించి కొంత సేపటికి క్లియర్ చేశారు. ఇక్కడ ఈ మార్గం ద్వారా ప్రయాణించే వారు చుట్టూ పక్కల తీక్షణంగా గమనిస్తూ వెళ్ళాలి. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే సమయంలో తప్పించుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.