వైరల్ : డ్రోన్ మింగేసిన ముసలి.. తర్వాత ఏం జరిగిందో చూడండి?

praveen
నీటి లో ఉన్నప్పుడు మొసలి ఎంత షార్ప్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవికి మొత్తం సింహం రారాజు అయితే అటు నీటిలో ఉంటే మాత్రం మొసలి రారాజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎందుకంటే మొసలి నీటిలో ఉంటేనే బలంగా ఉంటుంది. ఇక ఆ సమయంలో ఎలాంటి జంతువు వచ్చినా సరే ముసలి బలం ముందు తల వంచాల్సిందే. ముసలి కి ఆహారంగా మారాల్సిందే.  ఆ రేంజ్ లో నీటిలో ఉన్న మొసలికి బలం ఉంటుంది.  అంతే కాదు నీటిలో కనీసం ఏ జంతువులకు తెలియకుండా  నక్కినక్కి దాక్కుంటూ వేటాడుతూ ఉంటుంది మొసలి.

 ఇలా మొసలి వేటాడటం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించేలా ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్ గా మారిపోయాయి.  మొసలి క్షణాల సమయంలో వేటాడే తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి కూడా కేవలం కనురెప్ప కాలం లో ముసలి వేటాడింది. కానీ ఈసారి వేటాడింది జంతువుల్ని కాదు ఒక డ్రోన్ ను. సాధారణంగా అడవుల్లో డ్రోన్ల సహాయంతో ఇక పక్షులు ఎలా ఎగురుతాయి.. పరిసరాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని చిత్రీకరించడం చూస్తూ ఉంటాం. ఇక్కడ కొంత మంది ఇలాగే చిత్రీకరించాలని ప్రయత్నించారు. కానీ ఇక ఎగురుతున్న డ్రోన్ ను పక్షి అనుకున్న మొసలి లటుక్కున నోట్లో పట్టేసింది.

 అంతేకాదు డ్రోన్ మింగడానికి కూడా ప్రయత్నించింది. కానీ ఇంతలో ఆ డ్రోన్ ఏకంగా నోటిలోనే పేలిపోయింది. దీంతో ఆ ముసలి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చింది. సమీపంలో ఎగురుతున్న ఒక డ్రోన్ ను ఏదో పక్షి అని భావించిన మొసలి.. ఇంతలో నోటితో లటుక్కున పట్టుకుని గుటుక్కున మింగేయపోయింది. ఇక నోట్లో లో ఉన్న డ్రోన్ ని కొరడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా డ్రోన్ పేలిపోయింది. ఇక నోట్లో నుంచి పొగలు కూడా వచ్చాయి. దీంతో ఇక  ఆ మొసలి ఎన్నో అవస్థలు కూడా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: