వైరల్: పుచ్చకాయలు ఇలా కూడా వాడేస్తున్నారా ...?!

Suma Kallamadi
పుచ్చకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వేసవికాలం వచ్చిందంటే చాలు. ఈ పుచ్చకాయలకి చాలా డిమాండ్ ఉంటుంది. ఏ సీజన్లో అయినా ఆరోగ్యం కోసం ఈ పుచ్చకాయలను వాడుతూ ఉంటారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి సహాయ పడుతుంది. వైద్యులు కూడా పుచ్చకాయలు తినమని తమ రోగులకు సూచిస్తూ ఉంటారు. మరి ఇటువంటి పుచ్చకాయలను ఇక్కడ కొందరు కేటుగాళ్ళు స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించారు. దొంగల ముఠా ఓ వ్యాన్ నిండా పుచ్చకాయలు వేసుకొని బయలుదేరారు. ఇంతలో దారిలో వారిని పోలీసులు చూసి అనుమానించారు. పుచ్చకాయలను చెక్ చేసి చూడగా వారికి షాక్ తగిలింది. పోలీసులు పుచ్చకాయలను బయటకు తీయగా అందులో గంజాయి కనిపించింది. దొంగల ముఠా గంజాయిని తరలిస్తున్న విధానాన్ని పోలీసులు చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుచ్చకాయలు పైన బాగానే కనిపించినా లోపల ఎర్ర గుజ్జు తియ్యగా అందులో పెద్ద పెద్ద ప్యాకెట్ లు కనిపించాయి.
ఆ ప్యాకెట్ల నిండా గంజాయి ఉంది. అలా వ్యాన్ నిండా పుచ్చ కాయలు ఉన్నాయి. ఆ పుచ్చకాయలో గంజాయి భారీగా ఉంది. వాటి విలువ సుమారుగా కోట్లలో ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. దొంగలు రోజురోజుకీ తమ విధానాన్ని మార్చుకోవడం చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. వ్యాన్ లో పుచ్చకాయలను ఉంచి ఆ తర్వాత పుచ్చకాయల్లో గంజాయి ఉంచి అక్రమ రవాణా చేయడాన్ని చూసిన పోలీసులు తమ చుట్టూ ప్రదేశాలకు సందేశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రెడిట్ అనే వెబ్ సైట్ లలో అప్లోడ్ చేశాడు. దానిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు దొంగలు దొరికి పోయారు కదా అని సమాధానం ఇస్తున్నారు. ఇంకొందరు పుచ్చకాయలను ఇలా కూడా వాడుతారా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: