తొమ్మిది నెలల గర్భవతి.. ఆమె చనిపోతూ.. పాపకు ప్రసవం ..!
ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసిన జేమ్స్ కింద కొటేషన్ ద్వారా తన వ్యాఖ్యలు వింటే మాత్రం తప్పకుండా కళ్ళల్లో నీళ్ళు తిరగాల్సిందే. ఒక భావోద్వేగ పూరితమైన పోస్టులు చేయడం తో ప్రస్తుతం ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.జేమ్స్ అల్వారెజ్.. అతని ఒక సంవత్సరపు కుమార్తె అడలిన్ తో , ఒక సంవత్సరం క్రితం తన దివంగత భార్యతో ఉన్న ప్రసూతి ఫోటోషూట్‌ను తిరిగి సృష్టించారు.
ఇకపోతే జేమ్స్ అల్వారేజ్ భార్య యెసేనియా అగిలార్ నిండు గర్భం తో వాకింగ్ కోసం బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆమెను కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మరణించింది. ఆ సమయంలో శిశువును కాపాడటానికి వైద్యులు అత్యవసర సి-సెక్షన్ చేయవలసి వచ్చింది.. ఇక అంతే క్షేమంగా పాపను కూడా కాపాడారు వైద్యులు. ఇకపోతే జేమ్స్ భార్య చనిపోయిన రోజే, వీరి పాప అడెలిన్ పుట్టిన రోజు ..రెండూ కూడా ఓకే రోజు కావడంతో జేమ్స్ ఈ పోస్టులు పెట్టడం జరిగింది . అంతే కాదు ఈ పోస్టర్ కింద.. "అడేలిన్.. నాకు తెలుసు.ఈ రోజు కనుక మీ అమ్మ ఉన్నట్లయితే ఆమె చాలా సంతోషించేది.. అంతేకాదు ఆమె సజీవంగా జీవించి ఉన్నట్లయితే తప్పకుండా నీ పుట్టినరోజు వేడుకలను మరింత ఘనంగా జరిపించేది అని భావోద్వేగానికి లోనయ్యాడు.. ఇది చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ ..వారు కూడా చాలా భావోద్వేగానికి గురి అవుతున్నారు.