ఓ ఐఏఎస్ ఆఫీసర్ రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముతున్నాడంటే అసలు ఎవరైనా నమ్ముతారా? ఇక చాలా మంది ఇలాంటి సందర్భాన్ని అసలు అనుకోని ఉండలేరు కదా! అయితే ఈ నమ్మలేని సంఘటన అనేది నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా రోడ్డు పక్కన కూర్చుని కూరగాయలు అమ్ముతున్నట్లు ప్రస్తుతం నెట్టింట ఫొటోలు తెగ వైరల్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే "అతను ఐఏఎస్ అధికారి కాదేమో బహుశా ఈ ఫొటో ఫేక్ అనుకుంటా" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ కి ఈ దారుణమైన పరిస్థితి వచ్చిందా అని కూడా కొందరు ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో సదరు ఐఏఎస్ అధికారి స్పందించడం జరిగింది. ఈ ఫొటో నిజమేనని ఆయన ఫేస్‌బుక్‌లో తెలిపడం జరిగింది.ఇక ఈ ఫొటో వెనుక ఉన్న అసలు కథ ఇదీ అంటూ అఖిలేష్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ ప్రస్తుతం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడం జరుగుతుంది.
ఇక ఆ ఫేస్ బుక్ పోస్ట్ లో.... ''నిన్న నేను ఒక ఆఫీషియల్ పని మీద ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాను. తిరిగి వచ్చే టైంలో కూరగాయలు కొందామని బండి దిగాను. ఇక కూరగాయలు అమ్మే ఓ మహిళ వద్దకు వెళ్లి కూరగాయలను కొనాలని అనుకున్నాను. ఆ టైంలోనే దుకాణాన్ని కాసేపు చూసుకోవాల్సిందిగా ఆ మహిళ అడిగింది. బహుశా షాపు దగ్గర ఉండాల్సిన ఆ మహిళ పిల్లవాడు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. ఇక ఆ పిల్లవాడిని వెతికేందుకు వెళ్తున్నప్పుడు ఆమె తన షాపును నాకు అప్పజెప్పడం జరిగింది. క్షణంలోనే వస్తానని చెప్పడంతో నేను వెంటనే ఓకే అనేసి ఆమె షాప్ వద్ద కూర్చున్నాను.ఇక ఇంతలో ఒక కస్టమర్ కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడే నా ఫ్రెండ్ ఒక ఫొటో తీసి దాన్ని నా ఫోన్ నుంచి నా ఫేస్‌బుక్ లో షేర్ చేశాడు. ఇక ఆ ఫొటోని ఈ రోజే నేను చూశాను. అందుకే ఇప్పుడు దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను" అని అఖిలేష్ మిశ్రా పేర్కొనడం జరిగింది.