వైరాల్ : పిత్తితే లక్షలు ఎలా వచ్చాయబ్బా..??
ఏదో అనుకోకుండా చేస్తే అదే ఇప్పుడు తనకి జీవనాదారంగా మారింది. కొందరు సరదా కొద్ది పిత్తులు వేయించుకుని సదరు మహిళకు డబ్బులు చెల్లిస్తున్నారు.ఒకరోజు ఆన్లైన్లో లైవ్ లో ఉండగా ఒకసారి ఫార్ట్ అంటే బాంబు వేయాలని ఎవరో ఫన్నీ గా ఆమెను అడిగారట. ఆమె దానిని సీరియస్ గా తీసుకుని అడిగిన వెంటనే బాంబు వేసేసింది. కానీ భలే విచిత్రం కదండీ.అడిగిన వెంటనే ఇలా బాంబులు వేయడం అంటే మాములు విషయం కాదు కదా.ఇలా ఆ మహిళ ఆన్లైన్ లో వేసిన బాంబు వీడియో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత తానను తానుగా ఫార్ట్ క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్ అంటూ బిరుదు ఇచ్చేసుకుంది. గత మూడు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉందట.
ఇప్పటికి చాలామంది ఆమెకి రిక్వెస్టులు పెడుతూనే ఉన్నారట అలాగే ఈ పని చేసినందుకు వాళ్ళు ఆమెకి డబ్బులు కూడా ఇస్తారంట.ఒక్కో బాంబు వేసినందుకు దాదాపు రూ.13వేలు తీసుకుంటుందట. ఒక రోజైతే అధికంగా మూడు లక్షల రూపాయలు వచ్చాయట. ఇప్పటి వరకూ వీటి ద్వారా ఈమె సంపాదించింది రూ.18.5లక్షలు సంపాదించిందట. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఇలా దుర్వాసన రాకుండా బాంబ్స్ వేస్తున్న అని ఆమె చెబుతుంది.పాలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం వలన తనకు పిత్తులు అధికంగా వస్తాయని తెలిపింది. ఇంకో విషయం ఏంటంటే పిత్తినప్పుడు సౌండ్స్ పెద్దగా వినిపించడానికి ఆమె అక్కడ ఒక మైక్రోఫోన్ కూడా పెట్టుకుంటుందట.ఈ మహిళ తాను చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేయడం వలనే వచ్చిందని చెప్తుంది.